పెళ్లి మేకప్‌ను పూర్తిగా బ్యూటీషియన్లపై వదిలేయకుండా పెళ్లికూతుళ్లు కూడా తెలుసుకోవలసిన ఓ ఐదు మేకప్ టిప్స్.

పెళ్లి మేకప్‌ను పూర్తిగా బ్యూటీషియన్లపై వదిలేయకుండా పెళ్లికూతుళ్లు కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే మేకప్ మోతాదు ఎక్కువైతే ఫోటోల్లో బాగా కనిపించరు. అందుకోసం ఓ ఐదు మేకప్ టిప్స్.

* మీ మేని ఛాయకంటే రెండు షేడ్లు లైట్‌గా ఉన్న బేస్ వాడొద్దు. ఒకవేళ అలా వాడితే చర్మం బూడిద రంగులో కనిపిస్తుంది. అందుకని మేని ఛాయకు తగ్గ బేస్‌ను మాత్రమే వేసుకోవాలి.

* కళ్లు విశాలంగా కనిపించేందుకు మస్కారా వేస్తారు. అలాగని ఎక్కువ మస్కారా వేసుకుంటే ప్రయోజనం ఉండదు. రెండు కోటింగ్‌లు మాత్రమే వేయాలి.

* బుగ్గల్లో కెంపుకి ముదురు రంగు బ్లష్ వాడాలి. అయితే ఎక్కువ కాదు. దీంతోపాటు బుగ్గలపైన హైలైట్ కూడా వేసుకుంటే అందం పెరుగుతుంది. ఇటువంటి పైపై మెరుగులతో పాటు బాగా నిద్రపోవడం వల్ల ముఖం నిగారింపు వస్తుంది.

* ముదురు రంగు లిప్ పెన్సిల్ వాడకూడదు. పలుచటి పెదవులకు, దొడ్డుగా ఉండే పెదవులకు వేరు వేరు మేకప్ ఉంటుంది. పలుచటి పెదవులు ఉన్న వాళ్లు లేతరంగులు, దొడ్డు పెదవులు ఉన్న వాళ్లు కాస్త ముదురు రంగులు వాడాలి.



* ముఖంపై మొటిమలు, మచ్చలు, నల్లటి వలయాలు ఉంటే వాటిని కన్సీలర్‌తో కప్పివేయాలి. కన్సీలర్‌ను మందంగా పూయకుండా శరీర ఛాయకు తగ్గ రంగును పలుచగా రాసుకోవాలి.



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top