పెళ్లికి వెళ్లాలి అనగానే పట్టుచీరలే గుర్తుకు వస్తాయి. బరువైన పట్టుచీరలతో వెళ్లాలంటేనే భయం. గ్రాండ్‌గా కనిపిస్తూ పెళ్లికి వెళ్లడం ఎలా?

పెళ్లికి వెళ్లడానికి మనకు ఉన్నవి కంచిపట్టు, బెనారస్, ధర్మవరం, ఎంబ్రాయిడరీ చీరలు. వీటిలోనే భిన్నంగా లైట్ వెయిట్స్‌ని తయారుచేసుకోవచ్చు. కంచి శారీ బాగా హెవీగా ఉందనుకున్నప్పుడు ఫాలింగ్ ఉన్న మెత్తని ఫ్యాబ్రిక్‌ను ఎంచుకోవాలి. అది స్వచ్ఛమైన కంచిలోనే లభిస్తుంది. అయినా అప్పటికీ ఇంకా హెవీ అనుకునేవారు కంచిపట్టు బార్డర్‌ని విడిగా కొనుక్కొని మంచి శాటిన్, షిఫాన్, జార్జెట్ ఫ్యాబ్రిక్స్‌కి అటాచ్ చేసుకోవచ్చు. అదే పాత చీర బార్డర్ వేసుకుంటే ఆ చీరమీద ఉన్న బుటీస్‌ని షిఫాన్ శారీ మీద ఆప్లిక్ వర్క్ చేయించుకుంటే మంచి ఫాల్ ఉన్న లైట్ వెయిట్ కంచి పట్టుచీర పెళ్లికి రెడీ. దీనికి హెవీ ఎంబ్రాయిడరీ ఉన్న బ్లౌజ్ వేసుకోవాలి. ఇక సిల్క్ బెనారస్, జార్జెట్ బెనారస్, కోరా శారీస్ లైట్‌వెయిట్‌తో రిచ్ లుక్‌నిస్తాయి. ఎంబ్రాయిడరీ శారీస్ అయితే గోటా మెటీరియల్ వాడి, జరీ ఎంబ్రాయిడరీ చేయించుకుంటే బరువు తక్కువగా ఉంటుంది. ఇంకా శారీ గ్రాండ్‌గా ఉండాలి, బరువు ఇంకా తక్కువగా ఉండాలి అనుకుంటే పల్లు వైపు భాగం హెవీగా, మిగతా భాగం లైట్‌గా డిజైన్ చేయించుకుంటే బరువు తగ్గించవచ్చు. ఫ్యాబ్రికే షైనీగా, గ్లిట్టరీగా ఉన్నది ఎంచుకుంటే దాని మీద వాడే డిజైన్‌ను తగ్గించవచ్చు. ఫలితంగా చీర బరువూ తగ్గుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top