ఇంట్లోనే బ్యూటీ కిట్

* ఎండపెట్టిన నారింజ తొక్కల పొడిని రోజ్ వాటర్‌లో కలిపి ముఖానికి రాసుకుంటే మృతకణాలు పోయి చర్మం మెరుస్తుంటుంది.
* నిమ్మకాయరసం కలిపిన నీళ్లతో ముఖానికి ఆవిరి పడితే బ్లాక్, వైట్ హెడ్స్‌ను నివారించొచ్చు.
* రోజ్ వాటర్ సహజసిద్ధమైన టోనర్, క్లెన్సర్‌లుగా పనిచేస్తుంది.
* బొప్పాయి గుజ్జు ముఖంపై మచ్చల్ని మాయం చేస్తుంది.
* కీరదోసకాయ రసం సన్‌టాన్‌ని పోగొట్టడమే కాకుండా యాస్ట్రింజెంట్‌గా కూడా పనిచేస్తుంది.
* నిగారింపు లేని, పొడి చర్మం గల వాళ్లు ఆల్మండ్ పేస్ట్, పాలు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే ఫలితం ఉంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top