హెచ్‌డి కాస్మొటిక్స్, బిబి క్రీమ్స్, ఇల్యుమినేటర్స్, మినరల్ మేకప్... ఇవన్నీ సౌందర్య సాధనాల పేర్లు. చదవడానికే కాదు వేసుకోవడానికీ వెరైటీగా ఉండే ప్రాడెక్ట్స్ ఇవి. బ్యూటీ మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన వాటి వివరాలే ఇవి...

హెచ్‌డి కాస్మొటిక్స్, బిబి క్రీమ్స్, ఇల్యుమినేటర్స్, మినరల్ మేకప్... ఇవన్నీ సౌందర్య సాధనాల పేర్లు. చదవడానికే కాదు వేసుకోవడానికీ వెరైటీగా ఉండే ప్రాడెక్ట్స్ ఇవి. బ్యూటీ మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన వాటి వివరాలే ఇవి...

హెచ్‌డి మేకప్:
దీన్నే హైడెఫినిషన్ మేకప్ అంటారు. ఈ మేకప్‌ను నడివయసు దాటిన వాళ్లకి ఉపయోగకరం. ముఖంపై ఉండే ముడుతల్ని మాయం చేసి యంగ్‌లుక్ వచ్చేలా చేస్తుంది ఇది. ముఖంపై రంధ్రాలను, మచ్చలను కనిపించకుండా చేసేయొచ్చు హైడెఫినిషన్‌తో. దీనిలో ఉన్న బెస్ట్ క్వాలిటీ సహజంగా కనిపించడం.

బిబి క్రీమ్స్:
బ్లెమిష్ బామ్ లేదా బ్లెమిష్ బేస్ అంటారు. మేకప్ లేదా కన్సీలర్లు ఉపయోగించినప్పటికీ దాచలేని మచ్చల్ని బిబి క్రీమ్‌తో కప్పేయొచ్చు. చర్మాన్ని తెల్లగా-కాంతివంతంగా చేసేవి, యాక్నె-ముడుతలు నివారించేవి, సన్‌స్క్రీన్ కలిగినవి, ముఖంపై రంధ్రాలను తగ్గించేవి, మాయిశ్చరైజర్‌లు అంటూ వీటిలో పలు రకాలు మార్కెట్‌లో లభిస్తున్నాయి. వీటినుంచి మీకు సరిపడే రకాన్ని ఎంపిక చేసుకోవచ్చు.



ఇల్యుమినేటర్స్:
ఇవి చర్మానికి నిగారింపునిస్తాయి. ప్రతీ నెలా బ్యూటీపార్లర్లకు వెళ్లి ఫేషియల్ చేయించుకునేందుకు సమయం లేని వాళ్లకు ఇల్యుమినేటర్లు ఉపయోగకరం. ఫౌండేషన్‌కు బదులు జెల్, క్రీమ్ రూపాల్లో లభిస్తున్న వీటిని వాడొచ్చు. మందంగా ఉన్న ముక్కు కోటేరుగా కనిపించాలన్నా, జా-లైన్ (దవడ భాగం) బాగా కనిపించాలన్నా మామూలుగా వాడే మేకప్ క్రీమ్‌లకు బదులు ఇల్యుమినేటర్ వాడితే చక్కటి ఫలితం ఉంటుంది.

మినరల్ మేకప్:
హాలీవుడ్, బాలీవుడ్‌లలో దీనికి ఆదరణ ఎక్కువ. ఐరన్ ఆక్సైడ్స్, జింక్ ఆక్సైడ్, టైటానియం డయాక్సైడ్ వంటి మినరల్స్‌ను బాగా నలిపి మినరల్ మేకప్ కాస్మొటిక్ తయారుచేస్తారు. ఈ కాస్మొటిక్ పొడి రూపంలో విడిగా లభిస్తుంది. దీన్ని బ్రష్‌తో మాత్రమే వేసుకోవాలి. మినరల్ మేకప్ చాలా తక్కువ బరువు ఉంటుంది. అందుకని మేకప్ వేసుకున్న తరువాత చర్మంపై బరువుగా ఏదో పెట్టినట్టు, పూసినట్టు అనిపించదు. ముఖంపై ప్యాచ్‌ల్లా కనిపించకుండా బాగా కలిపి దీన్ని వాడాలి. వీటిలో కొన్నింటిలో విటమిన్‌లు కూడా ఉంటాయి. దాంతో రంగు మెరుగుపడి చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top