మంచి జ్ఞాపకశక్తి కోసం తీసుకోవలసిన ఆహారం

జింక్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దాంతో పాటు వైటమిన్-బి6, విటమిన్ బి12, యాంటీఆక్సిడెంట్స్ ఉన్న ఆహారం తీసుకోవడం కూడా అవసరం. ఈ విటమిన్లు, యాంటాక్సిడెంట్లు ప్రధానంగా తాజా పళ్లు అంటే... ద్రాక్ష, అన్ని నిమ్మజాతి (సిట్రస్) పళ్లు, ఆపిల్స్, ప్లమ్స్, బెర్సీస్, దానిమ్మ వంటివి, కూరగాయలు, ఆకుకూరలు, పొట్టు తీయని గోధుమ, రాగి, జొన్న, మొక్కజొన్న వంటి ధాన్యాలు, చిక్కుళ్లు, పాలు వంటి ఆహారంలో ఎక్కువగా ఉంటాయి.

మాంసాహారంలోనూ ఇవి ఉంటాయి. ఇక జింక్ ఎక్కువగా మాంసాహారం, సీ ఫుడ్, గుడ్లు, పాలలో ఉంటుంది. మాంసాహారం తీసుకోని వారు జింక్ కోసం పాలపై ఆధారపడవచ్చు. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top