ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలాంటిదే మరో సోషల్ నెట్‌వర్క్ సైట్ ఉంది తెలుసా మీకు?

ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలాంటిదే మరో సోషల్ నెట్‌వర్క్ సైట్ ఉంది తెలుసా మీకు? ఫేస్‌బుక్‌లో లేని ఎన్నో అధునాతన ఆప్షన్లు కలిగిన ఈ వెబ్‌సైట్ పేరు వాల్‌పోస్ట్ డాట్‌కామ్(www.wallpost.com). ఈ సైట్‌లో ఒక్కో ఆప్షన్‌కు ఒక్కో ప్రత్యేకత ఉంది.

అవేంటంటే...
ఇమేజెస్: 

ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో అయితే ఫోటోలు పెట్టడం వరకే ఉంటుంది. అదే ఇందులో అయితే మీరు పెట్టిన ఇమేజ్‌ను ఎంతమంది చూశారు, ఏ వెబ్‌సైట్ నుంచి, ఏ ప్రదేశం నుంచి చూశారు అనేటువంటి వివరాలను గ్రాఫ్ రూపంలో మీకు తెలుస్తాయి. అలాగే ఆల్బమ్స్‌కి కూడా.

అప్‌డేట్స్:

మిగతా సైట్లలో వచ్చే అప్‌డేట్స్ పదిహేను రోజులే కనిపిస్తాయి. మీకు ఎంత నచ్చిన అప్‌డేట్ అయినా కొత్త అప్‌డేట్స్ వచ్చాక కనిపించకుండా పోతుంది. మా వెబ్‌సైట్‌లో మీకు బాగా నచ్చిన అప్‌డేట్‌ను ఫేవరెట్ ఆప్షన్స్‌లో పెట్టుకుంటే ఎప్పటికీ పోకుండా ఉంటుంది.

సోషల్ యాడ్స్:

వేరే వెబ్‌సైట్లలో ప్రకటన ఇవ్వాలంటే డబ్బు కట్టాల్సి ఉంటుంది. కాని మా వెబ్‌సైట్‌లో అది ఫ్రీ. అంతేకాకుండా మీరు ఒక ప్రకటనను తయారుచేసి పెట్టుకుని అక్కడ ఉన్న లైక్ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్న అందరికీ ఆ ప్రకటన కనిపిస్తుంది. అలాగే ఆ ప్రకటన మిగతా స్నేహితులకి నచ్చితే వాళ్ల స్నేహితులకి కనిపిస్తుంది. అంటే రొటేట్ అవుతుంది అన్నమాట. ఆర్టికల్స్: మీకు ఆసక్తి ఉన్న అంశాలపై వ్యాసాలు, కథలు రాసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన ఏ అంశాన్నయినా... ఎంత యినా ఈ ఆప్షన్‌లో రాసుకోవచ్చు.

పాస్‌వర్డ్ ప్రొటెక్టెడ్ ఆల్బమ్స్:
ఫోటో ఆల్బమ్ తయారుచేసి పాస్‌వర్డ్ ప్రొటెక్టెడ్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఒక్కో ఫోటో కాకుండా ఆల్బమ్ మొత్తం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఫోటోటాగ్స్:

మీరు పెట్టిన ఫోటోలను ఫ్రెండ్స్ చూడాలంటే వాళ్ల పేర్లు ఒక్కో ఫోటోకు ట్యాగ్ చేస్తారు కదా. కాని ఇందులో ఎన్ని ఫోటోలు, ఆల్బమ్‌లు ఉన్నా ట్యాగ్ చేసేటప్పుడు ఒకే పేరు ఇస్తే అవన్నీ ఒకే దగ్గర కనిపిస్తాయి.

అడ్రస్‌బుక్: 

మొబైల్ ఫోన్లోలాగా పేరు, ఇ-మెయిల్ అడ్రస్, ఫోను నంబర్లు అన్ని వివరాలను ఇందులో లోడ్ చేసుకోవచ్చు. ఇలా అన్‌లిమిటెడ్‌గా సేవ్ చేసుకోవచ్చు. అచ్చం నోట్‌ప్యాడ్‌లో రాసిపెట్టుకున్నట్టు అన్నమాట.

ఆల్బమ్ ఇన్వైట్స్ హిస్టరీ:

ఈ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోని వాళ్లకి కూడా మన ఆల్బమ్ చూడమని ఇన్విటేషన్ పంపొచ్చు. అలాగే హిస్టరీలో వేరే యూజర్ చూస్తే మనకు ఆటోమేటిక్‌గా నోటిఫికేషన్ కూడా వస్తుంది.

రీసెంట్ విజిటర్స్: 

ఇందులో మన అకౌంట్‌ను వారంలో, నెలలో చూసిన వాళ్ల వివరాలతో పాటు, డేట్, టైం కూడా వస్తుంది. ఇవే కాకుండా అధునాతనంగా మరికొన్ని అంశాలను చేర్చే ప్రయత్నంలో ఉన్నాను. వాటిలో వాయిస్ టు టెక్ట్స్ అంటే మీరు హాయ్ అని అన్నారనుకోండి దాన్ని కీబోర్డు మీద టైప్ చేయనక్కర్లేదు. హాయ్ అని చెప్తే అది అక్షరాల రూపంలో వాళ్లకి మెసేజ్‌గా వె ళ్తుంది. మొబైల్ వెర్షన్ అంటే ఆండ్రాయిడ్, ఐ-ఫోన్ నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు.


అలాగే ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న ఫోన్ల నుంచి వాల్‌పోస్ట్‌లో ఉన్న యూజర్స్‌కి ఫ్రీగా మెసేజ్‌లు పెట్టొచ్చు. వీటితోపాటు డెస్క్‌టాప్ అప్లికేషన్ కూడా డెవలప్ చేస్తున్నాం. ఈ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే ప్రత్యేకంగా సైట్‌లోకి లాగిన్ అయ్యి చూసుకోవాల్సిన అవసరం లేకుండా స్క్రీన్ మీదనే మెసేజ్‌లను చూసుకోవచ్చు.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top