మనకు వంటిల్లే ఒక ఫార్మసీ అది ఎలాగో చూద్దాం రండి.

మన వంటింట్లో ఉండే మామూలు దినుసులే కొన్ని కొన్ని చిన్న రుగ్మతలను తగ్గిస్తాయి. మనం రోజూ వాడే పదార్థాలతో కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి. 
పసుపు: నీళ్లలో కాస్తంత పసుపు వేసి ఆవిరి పడితే జలుబు, దగ్గు తగ్గుతాయి.

మిరియాలు: స్వచ్ఛమైన తేనెలో కాస్తంత అల్లం రసంతో పాటు నాలుగైదు మిరియాలు తీసుకుంటే గొంతు ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఈ మిశ్రమం ఆకలిని కూడా పెంచుతుంది.

కొత్తిమీర: మనం ఆహారంలో వేసుకునే కొత్తిమీర జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది. కాస్తంత కొత్తిమీర రసాన్ని కొద్దిగా అల్లం రసంతో కలిపి చప్పరించడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. కడుపులో ఉబ్బరంగా ఉన్నప్పుడు కాస్తంత కొత్తిమీర రసం, అల్లం రసం... ఒక గ్లాసు నీళ్లలో కలిపి తాగాలి. దాంతో కడుపు ఉబ్బరం తగ్గుతంది.

ఏలకులు: నోటి దుర్వాసనను ఏలకులు సమర్థంగా అరికడతాయన్న విషయం తెలిసిందే. దాంతో పాటు వికారం, తలనొప్పికి కూడా ఏలకులు మంచి మందుగా పనిచేస్తాయి. కళ్ల మంటలు, దురదలు తగ్గడానికి కూడా ఏలకులు బాగా పనిచేస్తాయి.

వెల్లుల్లి: ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వెల్లుల్లిని వాడినప్పుడు అందులోని అలిసిన్ అనే పదార్థం (ఇదే వెల్లుల్లికి ఘాటైన వాసన ఇస్తుంది) అధిక రక్తపోటు, గుండెజబ్బుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రక్తనాళాల్లోని కొవ్వును తగ్గిస్తుంది.

శనగలు: కఫం తగ్గించడానికి శనగలు బాగా పనిచేస్తాయి. ఒక టేబుల్‌స్పూన్ శనగపిండిని ఒక చెంచా తేనెతో కలిపి రోజూ రాత్రివేళ తీసుకుంటే ఆ మిశ్రమం జీర్ణ సంబంధమైన అనేక సమస్యలను నివారిస్తుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top