ఖాళీకడుపుతో నిమ్మరసం తాగడం మంచిదేనా?


గ్లాసు గోరువెచ్చటినీళ్లలో ఒక నిమ్మచెక్క పిండుకుని ఆ నీరు తాగడం వల్ల ఈ కింది ప్రయోజనాలు కలుగుతాయి. 

  • నిమ్మరసం తాగడం వల్ల కాలేయం శుభ్రపడటంతో పాటు పనితీరు మెరుగుపడుతుంది.
  • నోటిలో లాలాజలం బాగా ఊరుతుంది. ఫలితంగా జీర్ణశక్తి పెరుగుతుంది.
  • నిమ్మకాయ నీళ్లు తాగడం మూలంగా కాలేయం మరిన్ని ఎంజైమ్స్‌ను ఉత్పత్తి చేస్తుంది.
  • మలబద్దకం తగ్గి మోషన్ ఫ్రీగా అవుతుంది. ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.
  • నిమ్మరసంలో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. పొటాషియం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. ఇది సోడియంతో కలిసి మెదడు, నాడీవ్యవస్థల పనితీరును మెరుగు పరుస్తుంది. రక్తంలో పొటాషియం నిల్వలు తగినన్ని ఉంటే మానసిక ఆందోళ న, ఒత్తిడి, మందకొడితనం, మతిమరపు మన ఛాయలకు కూడా రావు. మెదడు చురుగ్గా పని చేస్తుంది. గుండె పనితీరు మెరుగుపడుతుంది.  

  • రక్తంలో నిమ్మరసంలో క్యాల్షియం, మెగ్నీషియం నిల్వలు సమృద్ధిగా ఏర్పడతాయి. తగినంత స్థాయిలో క్యాల్షియం ఉండటం వల్ల రికెట్స్ వ్యాధి దరిచేరదు. మెగ్నీషియం గుండెకు చాలా మంచిది.
  • రక్తపోటు అదుపులో ఉంటుంది.
  • నిమ్మరసం రక్తంలో త్వరగా కలిసిపోయి అన్ని అవయవాలు చురుగ్గా పనిచేసేట్లు చేస్తుంది. భోజనానికి ముందు నిమ్మరసం తాగడం వల్ల పిహెచ్ స్థాయులు పెరుగుతాయి. ఫలితంగా రోగనిరోధకశక్తి గణనీయంగా పెరిగి, శరీరం వ్యాధులను సమర్థంగా ఎదుర్కొంటుంది.
  • నిమ్మరసం యూరిక్ యాసిడ్‌ను పలుచన చేసి, కీళ్లనొప్పులు, గౌట్స్ వంటి రుగ్మతల బారినపడే అవకాశాలను తగ్గిస్తుంది.
  • శరీరంలో కఫాన్ని తగ్గిస్తుంది.
నిమ్మరసం ఎప్పుడు, ఎలా తాగాలి?
శుభ్రమైన నీటిని మరిగించి, తాగే వేడి వరకు చల్లార్చి అరగ్లాసు నీటిలో ఒక నిమ్మచెక్క రసం పిండి, గింజలు రాకుండా చూసుకుని, చక్కెర తదితర తీపి కారకాలను కలపకుండా పరగడుపున తాగెయ్యాలి. కనీసం గంట గ్యాప్ తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చెయ్యాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటేనే పైన చెప్పిన ప్రయోజనాలన్నీ చేకూరతాయి. అతి సులువైన ఈ పద్ధతితో మీరూ మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top