నడక మొదలుపెడుతున్నారా..! అయితే వారికి కొన్ని సూచనలు...ఇవి పాటిస్తే చాలా ఉపయోగం ఉంటుంది .

చాలామంది నడక మొదలుపెట్టే ముందు చాలారోజులు వాయిదా వేస్తుంటారు. నడక అన్నది మొదలు పెట్టాలనుకున్న తర్వాత వాయిదా వేయకూడదు. అది భారంగా పరిగణించకూడదు. ఎందుకంటే దాన్ని ఒక ఉల్లాసపూరితమైన కార్యక్రమంగా గాకుండా... ఒక భారమైన వ్యాయామంలా పరిగణిస్తే మనం దాన్ని ఆసక్తిగా చేయం.  నడక మొదలు పెట్టాలనుకున్నవారికి కొన్ని సూచనలు... 

మీద నడవటం వల్ల మనం ఎంత వేగంగా నడుస్తున్నామో తెలుసుకోవచ్చు. ఇది ఇంట్లోనే చేసుకోగలం. కానీ ఉదయం వేళల్లో ఆరుబయట నడిస్తే ఉండే హాయి వేరు.

వాకింగ్ మొదలు పెట్టినప్పుడు ముందుగా రెండు రోజుల పాటు 10-20 నిముషాలపాటు నడవండి

కనీసం వారానికి ఐదు రోజల పాటు నడవండి.

ఇలా క్రమంగా 60 నిముషాలకు చేరుకోవాలి. (అంటే రోజూ 5-6 కిలోమీటర్లు నడవగలరు)

ముందుగా నడిచే దూరాన్ని పెంచుకోవాలి. తరువాతే నడకలో వేగాన్ని పెంచాలి. అయితే దూరాలకు నడవడం, నడకలో వేగాన్ని పెంచడం అన్నది ఒకేసారి వద్దు. క్రమంగా పెంచుకుంటూ పోవాలి. అయితే మూడు వారాల పాటు మామూలు వాకింగ్ చేశాక అప్పుడు వేగంగా నడవడం (బ్రిస్క్ వాకింగ్) చేయాలి.

మోకాళ్ల నొప్పి, నడుము నొప్పి, చీలమండల వాపులు లేదా 90 కిలోల కన్నా ఎక్కువ బరువు ఉన్నట్లయితే ముందుగా సైక్లింగ్ లేదా స్విమ్మింగ్ చేయడం మంచిది. కొంచెం ఫిట్‌గా అయిన తరువాత వాకింగ్, జాగింగ్, ఏరోబిక్స్ చేయడం మంచిది.  



భోజనం చేసిన వెంటనే నడక మొదలు పెట్టకూడదు. ఏదైనా తిన్నప్పుడు గంట తర్వాతనే వాకింగ్ మొదలు పెట్టాలి. అనారోగ్యంతో ఉన్నవారు పరగడుపున వాకింగ్ మొదలుపెట్టవద్దు. అలాంటివారు కొద్దిగా తిని ఆ తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుని అప్పుడే వాకింగ్ మొదలుపెట్టాలి. ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటున్న వారు ఇది విధిగా పాటించాలి. అనారోగ్యంతో ఉన్నవారు పరగడుపున వాకింగ్ మొదలుపెట్టవద్దు.

వాకింగ్‌లో మారథాన్, వాకథాన్ చేసేవాళ్లు కనీసం మొదటిసారైనా ఎక్స్‌పర్ట్ సలహా తీసుకోవాలి. 

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top