మన కంప్యూటర్‌ను హ్యాకింగ్ బారిన పడకుండా భద్రంగా ఉండాలంటే............

ఇంటర్నెట్‌తో మనకున్న ఉపయోగాలు ఎన్నైనా... హ్యాకింగ్ లాంటి చికాకుల కారణంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే మన కంప్యూటర్‌ను వీలైనంత భద్రంగా ఉంచుకోవడం అత్యవసరం. ఈ ప్రయత్నంలో రూట్ కిట్ల పాత్ర చాలా కీలకమవుతుంది. మన కంప్యూటర్‌లో రన్ అవుతున్న అప్లికేషన్లు, ప్రాసెస్‌లు, సిస్టమ్ డేటా అందరి కళ్లుపడకుండా దాచిపెట్టేందుకు ఉపయోగపడే ప్రోగ్రామ్‌లనే రూట్ కిట్లు అంటారు. హ్యాకర్లు వీటిని కేంద్రంగా చేసుకునే స్పైవేర్, వైరస్, మాల్‌వేర్‌లను ప్రవేశపెడుతూంటారు. ఈ మార్గంలో కంప్యూటర్‌లోకి చేరిన మాల్‌వేర్‌లను యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌లూ గుర్తించలేవు. ఈ నేపథ్యంలో మీ కంప్యూటర్‌లో రహస్యంగా దాగి ఉన్న రూట్‌కిట్ ప్రోగ్రామ్స్‌ను తొలగించేందుకు అందుబాటులో ఉన్న సాఫ్ట్‌వేర్‌లు.. 
  • BitDefender Rootkit Uncover: ప్రస్తుతం బీటా-2 వెర్షన్ అందుబాటులో ఉంది. http://download.bitdefender. com/windows/desktop/internet_security/beta/ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

  • DarkSpy 1.05: రూట్‌కిట్లను పరిహరించే మరో ప్రోగ్రామ్ ఇది. http://www.fyyre. net/~cardmagic/index_en.html వెబ్‌సైట్ ద్వారా అందుకోవచ్చు.
  
  • FSecure Black Light: ప్రస్తుతానికి ఈ సాఫ్ట్‌వేర్ ట్రయల్ వెర్షన్ మాత్రమే అందు బాటులో ఉంది. http://www.fsecure. com/blacklight/try_blacklight.html వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.

ఇవే కాకుండా http://www.gmer.net/ index.php ద్వారా జీఎంఈఆర్ అనే రూట్‌కిట్ రిమూవల్ ప్రోగ్రామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే http://helios.miellabs.com/ వెబ్‌సైట్ ద్వారా Helios Lite సాఫ్ట్‌వేర్‌ను కూడా రూట్‌కిట్ల తొలగింపునకు ఉపయోగించుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్‌లలో ఏదో ఒకదాన్ని డౌన్‌లోడ్ చేసుకుని రన్ చేస్తే మీ కంప్యూటర్‌లో అనవసరమైన రూట్‌కిట్లు ఏవైనా ఉన్నాయా? అన్నది తనిఖీ చేసుకోవచ్చు. తద్వారా మీ కంప్యూటర్ భద్రంగా ఉంటుంది. హ్యాకింగ్ ద్వారా ఎదురయ్యే ఇబ్బందులను చాలావరకూ తగ్గించుకోవచ్చు.



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top