రాత్రివేళల్లో డ్యూటీ చేస్తుంటే.....చాలామందికి స్థూలకాయం వచ్చే అవకాశాలు ఎక్కువ.....వారు తీసుకోవలసిన జాగ్రత్తలు

నైట్‌షిఫ్ట్ డ్యూటీలు చేసేవారిలో చాలామందికి స్థూలకాయం వచ్చే అవకాశాలు ఎక్కువ. దీనికి కారణం... రాత్రివేళ పనిచేసే ఉద్యోగుల్లో సాధారణంగా శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది. దాంతో పాటు ఆహారం తీసుకోవడంలో మార్పుల వల్ల స్థూలకాయం వస్తుంది. 

ఇప్పుడు మారుతున్న పనివేళల్లో రాత్రి డ్యూటీలు చేసే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది. భూమికి మరోవైపు ఉన్న దేశాల పనివేళల్లో పనిచేయాల్సి రావడంతో చాలా మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు రాత్రంతా పనిచేయాల్సి రావడం చాలా సాధారణమైంది. ఇలా నైట్ షిఫ్ట్‌లలో పనిచేసేవారు తమ ఆహారపు అలవాట్లను మార్చుకోవడం మంచిది. దాంతో చాలా మందికి వచ్చే అనేక సమస్యలు... అంటే ఛాతీలో మంట, అజీర్తి, మలబద్దకం వంటివి తగ్గుతాయి.

ఆహార నియమాలు... వీలైనంత తక్కువ పరిమాణంలో చాలా ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవాలి. దాంతో ఆహారం జీర్ణమవ్వడం తేలిక. గాస్ట్రో ఇంటస్టినల్ సమస్యలూ తక్కువ.

కేఫటేరియా వద్ద ఉన్న ఆహారం తీసుకోకూడదు. ఇంటి భోజనానికే ప్రాధాన్యం ఇవ్వాలి. అందులోనూ కొవ్వులు ఎక్కువగా లేకుండా, పీచుపదార్థాలు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

కాఫెటేరియాలోనే తినాల్సివస్తే... పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు అంటే... సలాడ్స్, పళ్లు, మొలకెత్తిన గింజలు, పొట్టుతో ఉన్న పప్పుధాన్యాలు, గింజధాన్యాలు (అంటే... పొట్టుతోనే ఉన్న గోధుమలతో చేసిన రోటీలు, మొక్కజొన్నలతో చేసిన పదార్థాలు, బ్రౌన్‌బ్రెడ్ శాండ్‌విచ్‌లు) వంటివి తీసుకోండి. కొవ్వు  ఎక్కువగా ఉండే పదార్థాలు, బాగా ఎక్కువగా వేయించిన వేపుళ్లు (ఫ్రెంచ్ ఫ్రైస్, సమోసాలు, చిప్స్ వంటివి) అవాయిడ్ చేయండి. తీపి పదార్థాలు, రిఫైన్డ్ ఫుడ్స్ (అంటే... క్యాండీలు, చాక్లెట్‌లు, వైట్ బ్రెడ్స్, బన్స్, పాస్తాస్, పిజ్జాలు, కూల్‌డ్రింక్స్) వంటిని వీలైనంత తక్కువగా తీసుకోవాలి.

వీలైనన్ని ఎక్కువసార్లు మంచినీళ్లు తాగాలి. కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్ కంటే నీళ్లు తాగడం మంచిది.

రోజూ 30-40 నిమిషాల పాటు వ్యాయామం తప్పనిసరి. వ్యాయామం చేయడం వల్ల మీ బరువు పెరగకుండా ఉంటుంది. వ్యాయామం చేయడం అన్నది నైట్ షిఫ్ట్‌కు వెళ్లే ముందర చేస్తే డ్యూటీ సమయంలో చురుగ్గా ఉండటం సాధ్యమవుతుంది. డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు డాక్టర్‌ను సంప్రదించి తగిన మందులు తీసుకోవాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top