అధిక బరువు, సరిపడని ఆహార అలవాట్లు, వ్యాయామ లేమి... వంటివి కీళ్లనొప్పులకు ప్రధాన కారణాలు.అందుకు ఉపయోగపడే ఆసనాలు

మోకాళ్లు, మోచేతులు, చేతి వేళ్ల కణుతుల వద్ద వాచిపోవడం, విపరీతమైన నొప్పి.. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. ఈ పరిస్థితిని నిర్లక్ష్యం చేస్తే తక్కిన అవయవాలకు వ్యాపించే ప్రమాదం ఉంది.. ఇందుకు మొదట సూక్ష్మ వ్యాయామాలని ప్రయత్నించాలి.

సూక్ష్మ వ్యాయామాలు: రెండు చేతులను ముందుకు చాచి అర చేతులని నెమ్మదిగా మూయడం, తెరవడం చెయ్యాలి. ఇలా మొదట చిన్నపాటి వ్యాయామాలు చేయడం వల్ల శరీరం తేలికగా ఉండి ఇతర వ్యాయామాలు చేయడానికి సౌకర్యవంతంగా ఉంటుంది.

కాళ్లను దగ్గరగా తీసుకొంటూ.. వెన్నెముక నిటారుగా ఉంచి.. రెండు కాళ్లూ ముందుకు చాపి కూర్చోవాలి. కుడి మోకాలిని వంచి దగ్గరకు తీసుకోవాలి. అలా కాసేపు ఉంచిన తర్వాత నెమ్మదిగా ముందుకు చాపాలి. అలా ఐదు నుంచి పది సార్లు చెయ్యాలి. ఇదే విధంగా ఎడమ కాలితో కూడా చెయ్యాలి.

వేళ్లను కదిలిస్తూ.. కుడి కాలిని ఎడమతొడపై ఉంచాలి.. ఎడమ చేత్తో కుడిపాదం వేళ్లుపట్టుకొని ముందుకి వెనక్కి సుతారంగా వంచాలి. పదిసార్లు అలా చెయ్యాలి. ఇదే విధంగా ఎడమకాలుకి కూడా చెయ్యాలి.

పాదచలనం: వెల్లకిలా పడుకొని రెండు చేతులు పక్కకు పెట్టి ఉంచాలి. రెండు కాళ్లని పైకి లేపి సైకిల్‌ తొక్కుతున్నట్టుగా చెయ్యాలి. పది సార్లు ముందుకి, పదిసార్లు వెనక్కి చెయ్యాలి.

కాళ్లను కదుపుతూ..: రెండు పాదాలని దగ్గరగా పెట్టి ముందుకు చాపి కూర్చోవాలి. రెండింటిని ముందుకు సాగతీసినట్టుగా పెట్టాలి. వెనక్కి కూడా స్ట్రెచ్‌ చెయ్యాలి. ఇలా పదిసార్లు నెమ్మదిగా చెయ్యాలి. ఇలా చేసేప్పుడు మోకాళ్లని పైకి లేపకూడదు. వాటినే పరిశీలిస్తూ శ్రద్ధగా మనసుపెట్టి చెయ్యాలి. కుడివైపునకు గుండ్రంగా ఐదుసార్లు... ఎడమ వైపునకు గుండ్రంగా ఐదుసార్లు చెయ్యాలి.

మోకాళ్లకు.. వెన్నుముక నిటారుగా ఉంచి కూర్చోవాలి. కుడిపాదాన్ని ఎడమ తొడపై ఉంచాలి. కుడి చేతిని కుడిమోకాలిపై పెట్టుకోవాలి. ఎడమ చేత్తో కుడిపాదాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు మోకాలిని పైకి, కిందకు కదుపుతూ ఉండాలి. ఇలా పదిసార్లు చెయ్యాలి. ఎడమకాలి వైపు కూడా కూడా చెయ్యాలి.

వాయుముద్ర: సుఖాసనంలో కూర్చుని చూపుడు వేలిని, బొటనవేలి కింద భాగానికి తాకించి ఉంచాలి. తక్కిన వేళ్లు ముందుకు చాచి ఉంచాలి. ఈ ముద్రని పావుగంటపాటు ధరించాలి. నొప్పులు తగ్గిపోతే ఈ ముద్రని కొనసాగించకూడదు. తప్పనిసరిగా ఆపేయాలి. శరీరంలోని వాయువులను అదుపు చేసే ఈ ముద్రని పక్షవాతం ఉన్నవారు కూడా చెయొచ్చు. అలాగే చిన్న చిన్న సమస్యలు అంటే తరచూ జలుబు చేయడం, తలనొప్పి వంటివి కూడా తగ్గిపోతాయి. అయితే ఈ ముద్ర వేసేటప్పుడు వేపుళ్లు, మాంసాహారం, పులుపు, ఉప్పు, ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు.      
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top