మన శరీరానికి కావాలి... "వాటర్ ధెరఫీ"....

వాటర్ థెరపీ... ఇప్పుడు స్లిమ్మింగ్ సెంటర్స్‌లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీని ప్రయోజనాలు కనిపించడానికి ఆలస్యం అవుతుంది. కాకపోతే దీని వల్ల ఎలాంటి హానీ ఉండదు. 

మన శరీరాన్ని హైడ్రేటెడ్ స్థితిలో ఉంచాలి, అంటే శరీరానికి తగినన్ని నీళ్లు, లవణాలు అందుబాటులో ఉంచడమే. ఒకవేళ మన శరీరానికి అవసరమైనంత నీటిని అందించకపోతే (ప్రాపర్ హైడ్రేషన్ లేకపోతే)... మనకు కొన్ని నష్టాలు కలుగుతాయి. ముఖ్యంగా మన శరీరంలోకి చేరిన ఆహారం, పోషకాలు శరీరానికి అందవు. మనం తగినంత ఆహారం తీసుకున్నా... తగినన్ని నీళ్లు తాగకపోతే శరీరంలోని కొన్ని వ్యర్థాలు బయటకు వెళ్లవు. దాంతో కొన్ని సమస్యలు వస్తాయి. అందుకే ఆహారం తీసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు తాగడం అవసరం. 

ఎక్కువగా ఆకుకూరలు తీసుకోని వారు, మలబద్దకం ఉన్నవారు తప్పనిసరిగా నీళ్లు తాగాలి. ఉదయం లేవగానే తాగే రెండు మూడు గ్లాసుల నీళ్లు మంచి విరేచనకారిగా కూడా పనిచేస్తాయి రక్తపోటుతో బాధపడేవారు, రక్తసరఫరా వ్యవస్థలో లోపాలు (సర్క్యులేషన్ డిజార్డర్స్) ఉన్నవారు, కిడ్నీలో రాళ్లు ఉన్నవారు, ఆర్థరైటిస్ వంటి వ్యాధులు ఉన్నవారు మిగతావారితో పోలిస్తే మరిన్ని నీళ్లు తాగాలి జీర్ణసమస్యలు ఉన్నవారు నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి 65 ఏళ్లు దాటినవారిలో దాహం అయ్యే పరిస్థితి కాస్త తగ్గుతుంది. అందుకే ఇలాంటి వారు దాహం అయ్యేదాకా ఆగడం కంటే అప్పుడప్పుడూ నీళ్లు తాగడం అవసరం గర్భవతులు మరిన్ని నీళ్లు తాగాల్సిన అవసరం ఉంది.

కడుపులో పెరుగుతున్న మరో ప్రాణి అవసరాలు తీర్చడానికి గర్భవతులు మిగతావారికంటే ఎక్కువ నీళ్లు తాగాలి పాలిచ్చే తల్లులు కూడా పాలు స్రవించడానికి వీలుగా మరిన్ని నీళ్లు తాగాలి పిల్లలు మిగతా వారి కంటే ఎక్కువగా నీళ్లు తాగాలి. పెద్దల కంటే పిల్లల్లో వినియోగితమయ్యే శక్తి ఎక్కువ. కాబట్టి దానికి అనుగుణంగా నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి.

మరి నీళ్లు ఎక్కువగా తాగడం కొద్ది మందిలో సమస్య కావచ్చు కూడా. నీళ్లు ఎక్కువగా తాగడం సమస్యాత్మకం అయ్యేది ఎవరిలోనంటే... కొందరిలో... ముఖ్యంగా పెద్ద వయసువారిలో నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల ఖనిజాలు ఎక్కువగా కడిగివేసినట్లుగా పోతాయి. అలాంటివారు నీళ్లు ఎక్కువగా తాగకుండా తీసుకోవాల్సిన ఆహారం మాత్రమే తీసుకోవాలి కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ లేదా మూత్రపిండాల వ్యాధి లేదా హెపాటిక్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు నీళ్లు తక్కువగా తాగాలి. అంటే వాళ్లు ద్రవాహారం పాళ్లను వైద్యనిపుణులు లేదా న్యూట్రిషనిస్టుల సలహా మేరకే తీసుకోవాలి.

బరువు తగ్గడానికి కేవలం నీళ్ల మీదే ఆధార పడకూడదు. పెరగకుండా ఉండటానికి మాత్రం వాటర్ థెరపీ ఉపయోగపడుతుంది.  

ఒక మనిషి ఆరోగ్యంగా ఉండటం కోసం రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలని వైద్యనిపుణులు, న్యూట్రిషనిస్టులు సూచిస్తుంటారు. ఇదేమీ కొత్త సంగతి కాదు. అయితే జీవనశైలిలో వేగం పెరగడం, తినే సమయంలో హడావుడిగా ఉండటం వల్ల చాలామంది కనీసం ఇన్ని నీళ్లు (ఎనిమిది గ్లాసులు) కూడా తాగరు. అందుకే నీళ్లు తాగడం అన్నది ఉదయం లేవగానే మొదలు పెట్టి... కొద్ది గంటలకు ఒకసారి విధిగా నీళ్లు తాగుతూ ఉండాలి. ఆహారం పూర్తయ్యాక తప్పనిసరిగా నీళ్లు తాగాలి.

వాటర్ థెరపీ... ఎలా...? 
ఒకేసారి ఎక్కువ నీళ్లు గుటకవేయవద్దు. ప్రతిసారీ చిన్న చిన్న గుక్కల్లో తాగుతూ ఉండాలి నీళ్లు మరీ చల్లగాగాని, మరీ వేడిగా గాని ఉండకూడదు. సాధారణ ఉష్ణోగ్రత (రూమ్ టెంపరేచర్) వద్ద ఉండాలి ఏదైనా తినడానికి ముందు నీళ్లు తాగకూడదు. నీళ్లు తాగాక ఆహారం తీసుకోవడానికి మధ్య వ్యవధి కనీసం అరగంట ఉండాలి ఉదయం నిద్ర లేవగానే ముందుగా నీళ్లు తాగాలి. శరీరంలో నిద్ర సమయంలో లోపించిన ద్రవాల భర్తీకి ఇది మంచి మార్గం. అంతేకాదు... ఇలా తాగడం వల్ల నిద్రించే సమయంలో మన శరీరంలో పేరుకుపోయిన మలినాలు తొలగిపోతాయి వ్యాయామానికి ముందు, తర్వాత నీళ్లు తాగాలి. అయితే వెంటనే కాకుండా కాస్త వ్యవధి ఇచ్చి తాగాలి డీహైడ్రేషన్‌కూ, శరీరంలో విషపదార్థాలకూ ఆస్కారం ఇచ్చే కూల్‌డ్రింక్స్ లాంటి ద్రవపదార్థాలను వీలైనంతగా తగ్గించాలి. 

ఒక అధ్యయనం ప్రకారం... ఒక వ్యక్తి తాగే నీళ్లు 17 ఔన్సుల(28.35 గ్రాములు = ఒక ఔన్సు. అంటే 17 ఔన్సులంటే... 481.95 గ్రాములు. అంటే సుమారు అర లీటరు) కంటే ఎక్కువ అయితే జీవక్రియల (బాడీ మెటబాలిజమ్) వేగం కూడా పెరుగుతుందని తేలింది.  

మరొక అధ్యయనం ప్రకారం... ఒక వ్యక్తి తాను తీసుకునే నీళ్ల కంటే రోజూ 1.5 లీటర్ల నీళ్లు ఎక్కువగా తీసుకుంటే ఏడాది వ్యవధిలో దాదాపు 5 పౌండ్లు బరువు తగ్గడానికి అవకాశం ఉంది. (ఒక పౌండు = 0.4536 కిలోలు) అంటే... రోజూ లీటరున్నర నీళ్లు అదనంగా తాగేవారు ఏడాదిలో దాదాపు రెండున్నర కిలోల బరువు తగ్గే అవకాశం ఉంది. ఇదెలా ఉన్నా నీళ్లతో మెటబాలిక్ రేట్ పెరుగుతుంది కాబట్టి బరువు పెరిగే అవకాశం ఉండదు. ఇది వాటర్ థెరపీలోని ప్రధానసూత్రం. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top