మన చర్మం మీద నల్ల కణాలు నశించటం వల్ల ఆ ప్రాంతం తెల్లబడుతుంది.మనం ఆ తెల్ల మచ్చలను బొల్లి అంటాం-దాని లక్షణాలు-చికిత్స.

మనం తెల్ల మచ్చలను బొల్లి అంటాం. వైద్యపరిభాషలో విటిలిగో లేదా ల్యూకోడర్మ అని పిలుస్తారు. దీన్ని వాడుకలో బొల్లి అంటారు. ప్రపంచ జనాభాలో ఒక శాతం కంటే తక్కువ జనాభా ఈ బొల్లి బారిన పడుతున్నారు. బొల్లి ఉన్న వారికి ఎలాంటి బాధ లేనప్పటికీ, ఈ తెల్ల మచ్చలు రోగిని సామాజికంగా, మానసికంగా కుంగదీస్తాయి. హోమియో చికిత్సతో బొల్లికి సమూలంగా నయం చేయవచ్చు. మనిషి శరీరంలో తెల్లమచ్చలు జీన్స్‌లో తేడా వల్ల వస్తాయి. మన దేహ రక్షణవ్యవస్థ నల్ల కణాలపై (మెలరోసైట్) దాడి చేయటం వల్ల ఆ ప్రాంతంలోని కణాలు నశిస్తాయి.

నల్ల కణాలు నశించటం వల్ల ఆ ప్రాంతం తెల్లబడుతుంది. ఈ తెల్లమచ్చలు వచ్చిన వారిలో యాభైశాతం మంది ఇరవై సంవత్సరాల లోపు వయసు వారే ఉంటారు. ఇంకా 40 సంవత్సరాల లోపు వయసు వారిలో ఎక్కువగా ఈ బొల్లి వస్తుంది. 40 సంవత్సరాల తర్వాత ఈ తెల్లమచ్చలు చాలా తక్కువ మందికి వస్తాయి. స్త్రీ, పురుషుల్లో సమానంగా వస్తున్న తెల్లమచ్చలు హైపర్‌థైరాయిడ్, అలోపిసియ ఎరియట, పర్‌నాసియ ఎనిమియాలో ఎక్కువగా చూస్తాం. తెల్లమచ్చలు రావటానికి ఖచ్చితమైన కారణాన్ని కనుగొనలేక పోయినా, కొన్ని రకాల జన్యుసంబంధ లోపాలు తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఇతర ఆటో ఇమ్యూనోడిజార్డర్స్ ఉన్న వారిలో రావటానికి ఎక్కువ ఆస్కారముంది. చర్మం శరీరానికి కవచంలా పనిచేస్తుంది. శరీరంలోని ఎముకలు, కండరాలు, ఇతర భాగాలు మూడు చర్మ పొరలతో కప్పబడి ఉంటాయి. ఎపిడెర్మిస్, డెర్మిస్, హైపోడెర్మిస్ పొరలుంటాయి. చర్మం అంతర్గత భాగాలకు కవచంలా పనిచేయటమే కాకుండా స్పర్శను కలిగి ఉంటుంది. మానసిక వ్యాధులు, ఇన్‌ఫెక్షన్‌లు చర్మంపై ప్రభావం చూపిస్తాయి.


కలవరపెడుతున్న తెల్లమచ్చలు చర్మవ్యాధుల్లో తెల్లమచ్చల సమస్య చాలామందిని కలవరపెడుతుంది. చర్మం, వెంట్రుకలు, కళ్లరంగు మెలాసిన్ హార్మోన్ ఉత్పత్తిపై ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైనా మెలనోసైట్స్ నశించటం వల్ల, మెలాసిన్ ఉత్పత్తి తక్కువ కావటం వల్ల చర్మం రంగు మారి తెల్లమచ్చలు ఏర్పడతాయి. ఈ తెల్లమచ్చలు ప్రతి వందమందిలో ఒకరికి లేదా ఇద్దరికి వస్తాయి. ఇవి వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశముంది. టైప్ 1 డయాబెటిస్, అడిసన్స్ వ్యాధులు, థైరాయిడ్ వ్యాధిగ్రస్థులకు ఎక్కువగా వచ్చే అవకాశముంది. కొంతమందికి శరీరంలోని రోగ నిరోధక శక్తి తగ్గి డీ పిగ్‌మెంటేషన్‌కు గురవుతుంటారు. మానసిక సమస్యలు, ఒత్తిడి, వల్ల కూడా తెల్లమచ్చలు వచ్చే అవకాశముందని పరిశోధనల్లో తేలింది.

లక్షణాలు ముఖ్యంగా తెల్లమచ్చలు ముఖం, చేతులు, పెదవులు, కాళ్ల పై వస్తాయి. ఈ మచ్చలు వచ్చిన వారు ఎండవేడిమిని తట్టుకోలేరు. ముక్కు, కళ్లు, నోటి చుట్టూ బంగారు గోధుమ రంగులో మచ్చలు ఏర్పడతాయి. వెంట్రుకలు కూడా తెల్లగా మారతాయి. ఈ మచ్చలు ఏ సైజులో వచ్చాయో అలాగే ఉండటమో లేదా పెరగటం కూడా జరగవచ్చు.

రోగ నిర్ధారణ తెల్లమచ్చలకు కచ్చితమైన కారణం లేకపోవటం వల్ల రోగి శరీర, మానసిక, కుటుంబ చరిత్రతో రోగ నిర్ధారణ చేస్తారు. థైరాయిడ్ గ్రంధి పనితీరును తెలుసుకునేందుకు రక్త పరీక్షలు చేస్తారు. శరీరంలో యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీలు ఉన్నందువల్ల ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌ను నిర్ధారణ చేయవచ్చు.


వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి? 
తెల్లమచ్చలకు శాశ్వత పరిష్కారం లేదు. కాని ఎప్పుడైతే మీ చర్మం రంగు మారుతున్నట్లు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించటం వల్ల తెల్లమచ్చలు పెరగకుండా చూడవచ్చు. మంచి చికిత్సతో రంగుమారిన చర్మాన్ని మళ్లీ మామూలు రంగులోకి తీసుకొని రావచ్చు. తెల్లమచ్చలు ఉన్న భాగం ఎండకు కందిపోతుంటుంది. అందుకే ఎండలో వెళ్లినపుడు తమ చర్మాన్ని కాపాడుకోవటం ముఖ్యం.

హోమియో చికిత్స తెల్లమచ్చలు మొదటి దశలో ఉన్నప్పుడే తగిన హోమియో చికిత్స తీసుకోవటం వల్ల ఈ సమస్య నుంచి బయటపడే అవకాశముంది. ఆధునిక హోమియో చికిత్స ద్వారా తెల్లమచ్చలను తగ్గించవచ్చు. రోగి యొక్క శారీరక, మానసిక, నడవడిక, పర్సనాలిటీ, సోషల్ బ్యాక్‌గ్రౌండుతో ఈ వ్యాధి లక్షణాలను విశ్లేషించి క్లాసికల్ హోమియో చికిత్స ద్వారా నిలకడగా మందులు ఇస్తారు. ఈ మందులు సరైన డోస్ ఇవ్వటం వల్ల మెలాసిన్ హార్మోన్‌ల స్థాయిని సరిచేయటమే గాక, పిగ్‌మెంటేషన్ స్టిమ్యూలేట్ చేసి అనారోగ్య చర్మాన్ని ఆరోగ్యవంతం చేయటానికి దోహదపడతాయి.

తెల్లమచ్చలు రావటానికి ఖచ్చితమైన కారణాన్ని కనుగొనలేక పోయినా, కొన్ని రకాల జన్యుసంబంధ లోపాలు తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఇతర ఆటో ఇమ్యూనోడిజార్డర్స్ ఉన్న వారిలో రావటానికి ఎక్కువ ఆస్కారముంది. చర్మం శరీరానికి కవచంలా పనిచేస్తుంది. శరీరంలోని ఎముకలు, కండరాలు, ఇతర భాగాలు మూడు చర్మ పొరలతో కప్పబడి ఉంటాయి.




block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top