ప్రతిరోజు రెండు గ్లాసుల టమాట జ్యూస్ తాగితే ఎముకలు దృఢంగా మారడమే కాకుండా
అస్టియోపోరోసిస్ దరిచేరకుండా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టమాటలో
ఉండే లైకోపీన్ అనే యాంటీఅక్సిడెంట్ ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తుందని
కెనడాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ టోరంటోకు చెందిన శాస్త్రవేత్తలు జరిపిన
పరిశోధనల్లో వెల్లడయింది. 50 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సున్న అరవై మంది
మెనోపాజ్ దశ దాటిన మహిళలపై ఈ పరిశోధనలు నిర్వహించారు. ఇందులో భాగంగా వారి
మెనూలో ఒక నెల రోజుల పాటు టమాట, టమాటతో చేసిన ఇతర పదార్థాలు ఏవీ లేకుండా
చేశారు. అప్పుడు వారి రక్తంలో ఎముక విరిగే సమయంలో విడుదలయ్యే
'ఎన్-టెలొపెప్టైడ్' అనే ఒకరకమైన కెమికల్ స్థాయి పెరగడాన్ని గమనించారు. ఆ తరువాత వారికి వరుసగా నాలుగు నెలలపాటు 15 మి.గ్రా
లైకోపీన్ ఉన్న టమాట జ్యూస్‌ను అందించారు. అప్పుడు వారిలో ఎన్-టెలొపెప్రైడ్
లెవెల్స్ చాలా వరకు తగ్గిపోయాయి. దీన్నిబట్టి టమాట తినడం వల్ల ఎముకలు
దృఢంగా ఉంటాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
ఎముకలు దృఢం గా ఉండాలంటే.......
teluguLifestyle Editor
10:30:00 AM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.