ఉపవాసంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటో చూడండి

ఉపవాసం చేయడాన్ని కేవలం సంప్రదాయకంగా మాత్రమే చూడకూడదు.,,దాని వల్ల కలిగే మేలు అంతా ఇంతా కాదు.. ఉపవాసాలు మన శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తాజాగా వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు. హిందువులు, క్రైస్తవులు, ముస్లిములు, బౌద్ధులు-అన్ని మతాల వారు ఉపవాస దీక్షకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. ఒక విధంగా దీన్ని భగవదారాధనలో భాగంగా చూసినప్పటికీ దీని వల్ల శరీరానికే కాక మనసుకూ ఎంతో ఆరోగ్యకరమని చెప్పవచ్చు. ఉపవాసం చేసే సమయంలో ఆకలి వేసినప్పటికీ దాన్ని జయించడానికి పాటించే మనోనిగ్రహం మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని శాస్త్రీయంగా కూడా రుజువైంది. ఉపవాసాల వల్ల కలిగే మేలేమిటో మీరూ చూడండి...
  •   ఉపవాసం చేయడం వల్ల శరీరంలోని మలినాలు శుభ్రంగా తొలగిపోయి శరీరం స్వచ్ఛతను పొందుతుంది. మనసు కూడా పరిశుద్ధం చెందుతుంది. మనోనిగ్రహం పెరిగి అది మానసిక వికాసానికి ఎంతో మేలు చేస్తుంది.
  •  ఒక రోజంతా ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరంలోని జీర్ణవ్యవస్థకు విశ్రాంతి లభిస్తుంది. మలినాలు పూర్తిగా తొలగిపోయి శరీరం కొత్త శక్తితో, రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ పనిచేస్తుంది. చీ శరీరంలోని లక్షలాది కణాలు పునరుజ్జీవం చెంది రక్తప్రసరణ మెరుగుపడడంతోపాటు కొత్త శక్తి పుడుతుంది.
  • భౌతిక కాంక్షలను నియంత్రించుకోవడం సాధ్యపడితే ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ఎటువంటి క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కోగలను అన్న ఆశావాద దృక్పథం ఏర్పడి జీవితాన్ని విజయపథంవైపు తీసుకెళుతుంది.
  •  ఉపవాసం చేయడం వల్ల ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతుంది. బరువు తగ్గడానికి కూడా ఇది తోడ్పడుతుంది. అయితే బరువు తగ్గాల్సిన వారు వైద్యుల సలహామేరకు ఉపవాసం చేయడం మంచిది.

ఏదేమైనా, ఒక రోజు భోజనం మానేస్తే ఇన్ని లాభాలు ఉన్నపుడు నెలకు ఒకటి రెండు సార్లు ఉపవాసం చేసి శరీరాన్ని పరిశుభ్రం చేసుకోవడం మంచిదే కదా!
 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top