కృత్రిమపళ్లతో జీవితాంతం ఉండొచ్చా?

ఈమధ్య కాలంలో యాక్సిడెంట్ల వల్ల ముఖానికి దెబ్బలు తగలడం సర్వసాధారణమైపోయింది. పళ్లు విరగడం, ఊడిపోవడం జరుగుతూ ఉంటుంది. పళ్లు కొద్దిగా విరిగినా, సగానికి చిట్లిపోయినా పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. కేవలం ఒకటి రెండు సిట్టింగుల్లో లామినేట్స్ ద్వారాగాని, క్రౌన్స్ ద్వారాగాని ఎంతో అందంగా, మునుపటి పంటి సైజ్, షేప్‌లో సహజంగా కనిపించే ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఇవి మిగిలిన పంటి రంగులో కలిసిపోతాయి. కృత్రిమమని ఎవరూ గుర్తించే అవకాశం లేదు.

సెరామిక్ / జిర్కోనియం టెక్నాలజీ...
ఒకప్పుడు మెటల్ పళ్లు ఉండేవి. తెల్లటి రంగులో ఉండే పళ్లు అమర్చినా అవి మిగిలిన పళ్ల రంగుతో కలవకపోవడం వల్ల అందరూ కృత్రిమ దంతాలుగా గుర్తించేవాళ్లు. అంతేగాక తరచూ ఊడిపోవడం, అరిగిపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కానీ... ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అత్యాధునిక టెక్నాలజీ, మెటీరియల్స్ అందుబాటులోకి రావడం వల్ల సమస్యలు చాలావరకు తగ్గాయి. సిరామిక్ పళ్లుగా అందరూ పిలుచుకునే పంటి రంగులో కనిపించే పదార్థంతో ఎక్కువగా వీటిని తయారు చేస్తున్నారు. మరింత లేటెస్ట్‌గా జిర్కోనియం లాంటి మెటీరియల్స్ అందుబాటులోకి రావడంతో పూర్తిగా పై సమస్యలన్నీ తీరినట్టే. 


గుర్తుంచుకోవాల్సిన విషయం...
పళ్లు పూర్తిగా ఊడిపోతే ఒక విషయం అందరూ గుర్తుంచుకోండి. ఊడి, కింద పడిన పళ్లను జాగ్రత్తగా సేకరించి చల్లటి నీటిలోగాని, పాలలో గాని భద్రపరచి, స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకువస్తే వాటినే ఊడిన స్థానంలో అమర్చవచ్చు. అవి తిరిగి అతుక్కుపోతాయి. అప్పుడప్పుడూ చెకప్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. కానీ... మీ పాప విషయంలో ఊడిన పళ్లు లేవు కాబట్టి తప్పనిసరిగా కృత్రిమ దంతాలపై ఆధారపడాల్సిందే. ఫిక్స్‌డ్ దంతాలు రెండు రకాలుగా ఉంటాయి.

దృఢమైన పక్కపళ్లను ఆధారంగా బిగించే వాటిని బ్రిడ్జ్ అంటారు. చాలా మంది పోయిన పళ్లను బిగించడానికి ఆరోగ్యంగా ఉన్న పళ్లను అరగదీస్తున్నారనే వాదన కూడా ఉంది. ఈ సమస్యను అధిగమించడానికి ఇంప్లాంట్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది.

ఇంప్లాంట్ టెక్నాలజీ...
ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా పోయిన పళ్ల స్థానంలో పక్కపళ్లను అరగదీయనవసరం లేకండా, వాటి సపోర్ట్‌తో పనిలేకుండా ఎముకలోకి చిన్న స్క్రూలను అమర్చి వాటి సాయంతో ఎంతో సహజంగా కృత్రిమ దంతాలను అమర్చవచ్చు.  



వీటితో మామూలు పళ్లలాగే కొరకవచ్చు, నమిలితినవచ్చు. ఎముకలోకి ఇంప్లాంట్ అనబడే స్క్రూలు బిగించడం ఎంతో పెద్ద చికిత్స అని కొందరు అపోహ పడతారు. ఇది ఎంతో సులభంగా, ఎటువంటి నొప్పి లేకుండా చేసుకోవచ్చు. ఒకప్పుడయితే ఈ చికిత్స ఖరీదైనదైనే అభిప్రాయం ఉండేది. కానీ... ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top