పాత చీరను,బ్లౌజ్‌ను మారుతున్న ట్రెండ్‌ కి అనుగుణంగా కొన్ని మార్పులు

ట్రెండ్ మారుతున్న ప్రతిసారీ వార్డ్‌రోబ్ మొత్తాన్ని మార్చడం ఎవరి వల్లా కాదు. అలాగని ట్రెండ్‌ని ఫాలో అవకుండానూ ఉండలేం. మన వార్డ్‌రోబ్‌లో ఉన్న చీరలు, బ్లౌజ్‌లకే కొన్ని మార్పులు చేసుకుంటే ప్రస్తుత ట్రెండ్‌ని ఫాలో అవ్వచ్చు.

పొట్టి చేతులను పొడవుగా...
ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ మొదలైంది. నిన్న, మొన్నటి వరకు పొట్టి చేతుల బ్లౌజులు వేసుకున్నాం. ఇప్పుడు లాంగ్ స్లీవ్స్ ఫ్యాషన్. అలాగని కొత్త బ్లౌజ్‌ల కోసం హైరానా పడకుండా ఉన్నవాటికే కొత్త రూపం ఇవ్వచ్చు. పొట్టిచేతులను బ్లౌజ్ నుంచి వేరు చేసి చీరలో ఏ కలర్ బాగా కనపడుతుందో ఆ కలర్ మ్యాచ్ అయ్యే క్లాత్ కొనుక్కొని పొడవు చేతులను వేయించుకోవాలి. అలాగే పాత స్లీవ్స్‌కున్న బార్డర్‌ని కట్‌చేసి లాంగ్ స్లీవ్స్‌కి అటాచ్ చేసుకోవచ్చు. లావు చేతులు ఉన్నవారు నెట్, బెనారస్ నెట్... సన్న చేతులు ఉన్నవారు ఏదైనా సిల్క్ ఫ్యాబ్రిక్ వేసుకుంటే బాగుంటుంది. పొడవు చేతులకు ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తే అందంగా ఉంటాయి. క్రోషియో, బంజారా వర్క్ కూడా ఇప్పుడు ట్రెండ్. మీ దగ్గర ఉన్న పాత బ్లౌజ్‌లకు వీటిని వాడచ్చు.

మీ దగ్గర ఉన్న ప్రతీ చీరకు బ్లౌజ్‌ను మార్చేయండి. ప్యాచ్ వర్క్, మిర్రర్ వర్క్‌తో ఉన్నవి ట్రై చేయండి. కొత్త చీర కట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది.

సాదా చీరనూ మెరిపించవచ్చు...
కొన్నిరకాల ఫ్యాబ్రిక్స్‌కి మ్యాచింగ్ అస్సలు దొరకదు. అలాంటప్పుడు సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకొని డై చేయించుకోవచ్చు. అలాగే కొన్నిరకాల చీరలు కూడా చాలా సాదాగా ఉంటాయి. ఇప్పుడంతా శాటిన్, ప్రింటెడ్ ఫ్యాబ్రిక్స్ ఫ్యాషన్ కాబట్టి దానికి తగ్గట్టుగా ప్లెయిన్‌గా ఉన్న చీరలను కూడా మార్చుకోవచ్చు. ప్లెయిన్ శాటిన్ శారీకి మరో శారీకున్న బార్డర్ తీసి ప్యాచ్‌గా వేసుకోవచ్చు. పాత చీరలోని ఎంబ్రాయిడరీ వర్క్‌ని ప్లెయిన్ చీర మీద ఆప్లిక్ వర్క్ చేయించుకోవచ్చు. మిర్రర్, థ్రెడ్ వర్క్ మళ్లీ ఫ్యాషన్ కానున్నాయి. మీ దగ్గర ఉన్న సాదా చీరలు, బ్లౌజ్‌లను వీటితో మెరిపించవచ్చు.
  • పట్టుచీరలు కట్టి కట్టి బోర్ కొడుతున్నాయనుకుంటే వాటి బార్డర్ తీసి... బెనారస్, కంచి బార్డర్ వేసుకుంటే చీరలకు న్యూ లుక్ వస్తుంది.
  • రొటీన్ బార్డర్స్‌ను తీసేసి క్రోషియా బార్డర్స్ వేసుకోవచ్చు.
  •  లైట్‌కలర్ ప్లెయిన్ శారీస్ ఉంటే వాటిని డైయింగ్ చేయించవచ్చు.
  • ఎక్కువసార్లు కట్టి బోర్ అనిపించిన రెండు పర్‌ఫెక్ట్ కాంబినేషన్ చీరలు తీసుకొని లంగా ఓణీ చీరగా మార్చేయండి. డిజైన్లు, ఆప్లిక్ వర్క్‌తో రెండు చీరలు కలిపితే మళ్లీ రెండు కొత్త చీరలు రెడీ అవుతాయి. 
  • కొందరకి చాలా పాతకాలం నాటి పట్టుచీరలు ఉంటాయి. బార్డర్ పాడైనప్పటికీ వెండి బుటీస్, జరీ ఉంటుంది. వీటిని ఉప్పాడ, కోటా చీరలపైకి ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. దీంతో కొత్త చీర తయారవుతుంది.
  • నిన్నటి వరకు నెటెడ్ చీరలకు బ్రొకేడ్ పెట్టీకోట్స్ వేసుకున్నాం. ఇప్పుడు శాటిన్ ఫ్యాషన్. కనుక శాటిన్ పెట్టీ కోట్స్‌ను వాడితే బాగుంటుంది.
  • ఇలా చిన్న చిన్న టిప్స్‌తో పాత చీరలను కొత్తగా తయారుచేసుకోవచ్చు.
 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top