పొట్ట తగ్గడానికి లైపోసక్షన్‌, వైబ్రేటింగ్ బెల్ట్స్ ఏ ప్రక్రియ మంచిది?

కడుపు చుట్టూ కొవ్వు పేరుకోవడం వల్ల పొట్ట పెరగడం అన్న సమస్య ఈ రోజుల్లో చాలా ఎక్కువ. ఇప్పుడు అన్ని వృత్తులలోనూ శారీరక శ్రమ చాలా తగ్గిపోతుండటంతో గతంతో పోలిస్తే ఈ సమస్య పెరుగుతోంది. పొట్ట అన్నది కేవలం ఆకర్షణీయంగా కనిపించకుండా చేయడం మాత్రమే గాక... ఆ తర్వాత వెన్నునొప్పి, కీళ్లనొప్పి, కొందరిలో డయాబెటిస్ వంటి వాటికీ కారణమవుతోంది.

పొట్ట తగ్గించడానికి ఇప్పుడు చాలా మంది నాన్ సర్జికల్ ఉపకరణాలైన వైబ్రేటింగ్ బెల్ట్స్, టమ్మీ రెడ్యూసింగ్ బెల్ట్స్ వంటివి ఉపయోగిస్తున్నారు. మసాజ్ వంటి ప్రక్రియలపై ఆధారపడుతున్నారు. అయితే ఇలాంటి నాన్ సర్జికల్ ఉపకరణాల వల్ల చాలా పరిమితంగానే ప్రయోజనం ఉంటుంది. ఆ తర్వాత తగ్గిన పొట్టను పెరగకుండా ఉంచడం కోసం చాలా తక్కువగా తినడం వంటివి చేస్తుంటే కళ్ల కింద గుంటలు పడటం, చెంపలు పీక్కుపోవడం వంటివి జరుగుతాయి. పొట్ట తగ్గించడానికి లైపోసక్షన్ మంచి మార్గం. దీనితో పొట్టలోని కొవ్వును తీసేయడం వల్ల ప్రభావం తక్షణం కనిపించడం మాత్రమే గాక... ముఖం, కళ్లు పీక్కుపోవడం వంటి పైన పేర్కొన్న ఇతర ప్రభావాలు కనిపించవు.


ఇప్పుడు లైపోసక్షన్‌లోనే మరింత అధునాతనమైన రీతిలో ‘ఎస్‌ఏఎల్’ (అక్షన్ అసిస్టెడ్ లైపో) వంటివి మరింత సురక్షితంగా, మరింత ప్రభావపూర్వకంగా చేయవచ్చు. ఈ కొవ్వు తీసివేసిన తర్వాత వదులుగా అయ్యే పొట్ట చర్మం మళ్లీ మునుపటిలా అయ్యేందుకు బిగుతుగా ఉండే లోపలి దుస్తులను ఒక మూడు నెలల పాటు వాడాల్సి ఉంటుంది. మీరు రోజూ వేసుకునే దుస్తుల లోపల ఈ దుస్తులను ధరించాల్సి ఉంటుంది. అయితే ఆ తర్వాత మీరు మంచి ఆహార నియమాలు పాటిస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తుంటే మీకు పొట్టపెరగకుండా ఉంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top