ఇంకా online లో మనమే మేకప్ వేసుకుని చూసుకొని మేకప్ వస్తువులు కొనవచ్చు. అది ఎలా అంటే......


ఇప్పటివరకూ బ్యూటిపార్లర్‌కి, మేకప్ స్టూడియోలకు వెళ్లి మేకప్ వేయించుకోవడం గురించి విన్నారు. ఇప్పుడు లేటెస్ట్‌గా ఆన్‌లైన్ మేకప్ అందుబాటులోకి వచ్చేసింది. మార్కెట్‌లో మనకి కావాల్సిన మేకప్‌వస్తువులు బోలెడు ఉన్నా...మనకి ఏవేవి నప్పుతాయో తెలుసుకుని కొనుక్కోవడం చాలా కష్టం. అలాంటి కష్టాల్ని తీర్చే ప్రయత్నంలోనే మెడ్‌ప్లెస్‌వారు కొత్తగా ఒక వెబ్‌సైట్‌కి రూపకల్పన చేశారు.medplusbeauty.com అనే ఈ వెబ్‌సైట్‌లో వెయ్యి రకాల మేకప్ వస్తువులు ఉన్నాయి.

ఆన్‌లైన్ ద్వారా మేకప్ వస్తువులు కొనుక్కోవడం కొత్త విషయం కాదు కాని మనం ఎంచుకున్న ప్రాడెక్ట్ వాడకంలో ఎలా ఉంటుందో కూడా తెలుసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ వెబ్‌సైట్ నిర్వహకులు. ఉదాహరణకి మనకి ఒక రంగు లిప్‌స్టిక్ నచ్చిందనుకోండి పెదాలపై ఆ రంగు ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే వెబ్‌సైట్‌లో ఉన్న మోడల్‌కి వేసి చూసుకోవచ్చు.

సైట్‌లో కనిపించే మోడల్‌కి నప్పినంత మాత్రాన మన ఒంటిపై బాగుంటుందో లేదో అనే సందేహం వస్తే మన ఫోటో ఒకటి సైట్‌లో అప్‌డేట్ చేసుకుని మన బొమ్మకే మేకప్ వేసుకుని చూసుకోవచ్చు. హెయిర్ కలర్ దగ్గర నుంచి ఐలైనర్ వరకూ అన్ని వస్తువుల్ని ఆన్‌లైన్‌లో వాడి, మనకి సూటయినవాటినే సెలక్ట్ చేసుకుని మరీ కొనుక్కోవచ్చన్నమాట. ఈ మధ్యనే అందుబాటులోకి వచ్చిన ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోడానికి అమ్మాయిలు చాలా ఆసక్తి చూపిస్తున్నారు.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top