నడుంనొప్పి, మెడనొప్పి, భుజంనొప్పి ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయాయి. అయితే నొప్పికి కారణమవుతున్న డిస్క్ సమస్యలకు పరిష్కారం.

నడుంనొప్పి, మెడనొప్పి, భుజంనొప్పి ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయాయి. ఎవరిని కదలించినా ఏదో ఒక నొప్పితో బాధపడుతున్నామని చెబుతుంటారు. కొందరిలో రోజు వారి కార్యక్రమాలు సైతం చేసుకోలేని విధంగా నొప్పి బాధిస్తూ ఉంటుంది. నొప్పి నివారణ మాత్రలు ఎన్ని వాడినా తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం లభించదు. అయితే నొప్పికి కారణమవుతున్న డిస్క్ సమస్యలకు హోమియో వైద్య విధానంలో పరిష్కారం.

సాధారణంగా నడుంనొప్పి, మెడ నొప్పి మొదలయినపుడు మూడు, నాలుగు వారాలలో దానంతట అదే తగ్గిపోతుంది. ఒకవేళ అప్పటికీ తగ్గకపోతే తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి. వెన్నులో ప్రధానంగా డిస్క్ సమస్యలు, స్పాండిలోసిస్, స్కొలియోసిస్, ట్యూమర్స్, కణుతులు, సయాటికా, ఇతర ఇన్‌ఫెక్షన్లు వంటివి ఏర్పడుతుంటాయి. మన శరీర వ్యవస్థలో వెన్నెముక మూలస్తంభంలాగా పనిచేస్తుంది. వెన్నెముకకు తోడుగా కండరాలు, లిగమెంట్లు, డిస్క్‌లు ఉంటాయి. వెన్నెముక సులభంగా వంగడానికి డిస్క్‌లు, లిగమెంట్లు తోడ్పడతాయి. వెన్నుపూసల మధ్య రబ్బరు కుదురులాంటి ఒక పదార్థం ఉంటుంది. దీనిని డిస్క్ అంటారు. వెన్నుపాము పొడవునా ఎన్నో నరాలు వెళుతుంటాయి.

మెడ భాగం నుంచి వెళ్లే నరాలు చేతుల్లోకి పాకుతాయి. నడుము నుంచి వెళ్లే నరాలు కాళ్లలోకి వెళతాయి. వీటిలో కొన్ని నరాలు మూత్రకోశం, మలవిసర్జన భాగంతో పాటు, లైంగిక భాగాల్లోకి వెళతాయి. అందువల్లనే డిస్క్ సమస్యలు కలిగి ఉన్నవారికి లైంగిక సమస్యలు ఎదురవుతాయి. అంగస్తంభనలు లేకపోవడం, శీఘ్రస్కలనం వంటి సమస్యలు కనిపిస్తాయి. వెన్నెముకలోని డిస్క్‌లు దెబ్బతినడం వల్ల చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ డిస్క్‌లు శరీరంలోని కదలికలకు ప్రధానమైన భాగం కావడం వల్ల మెడ దగ్గర, నడుం దగ్గరలోని డిస్క్‌లు ఎక్కువగా దెబ్బతింటాయి. డిస్క్‌లు వెన్నెముక కదులుతున్నప్పుడు షాక్ అబ్జార్బర్‌లాగా పనిచేస్తాయి. డిస్క్‌ల్లో రెండు రకాల సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి.


ఒకటి డిస్క్ ప్రొలాప్స్, రెండవది డిస్క్ డి జనరేటివ్ డిసీజ్. డిస్క్ బయట ఉన్న పొర బలహీనమవటం వల్ల డిస్క్ వెనకకు జరిగి కాళ్లలోకి వచ్చే నరాలపై ఒత్తిడి తెస్తాయి. ఏ ప్రాంతంలో నరాలపై ఒత్తిడి పడితే ఆ ప్రాంతంలో తిమ్మిరులు, మొద్దుబారడం, మంటలుగా అనిపించడం జరుగుతుంది. దీనినే స్లిప్ డిస్క్ అంటారు. ఒక్కొక్కసారి యాస్కులస్ అనే పొర చిట్లి, జెల్లీలాంటి డిస్క్ మెటీరియల్ బయటకు వస్తుంది. దీనినే డిస్క్ ప్రొలాప్స్ అంటారు. దీనివల్ల నడుం, కాళ్లలోనొప్పి ఉంటుంది. కాలును వంచకుండా తిన్నగా ఉంచి పైకిఎత్తినపుడు, కాలులోనొప్పి పెరిగితే దానిని డిస్క్ ప్రొలాప్స్ అంటారు.
మెడనొప్పి
మెడ నొప్పి 30 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మెడ ప్రాంతంలో ఉండే పూసలను సెర్వికల్ వర్టిబ్రా అంటారు. మెడ భాగంలో ఉన్న వర్టిబ్రా మధ్యలో ఉన్న డిస్క్ అరిగి కొంచెం పక్కకు జరిగి అక్కడ ఉన్న నాడులను ఒత్తిడికి గురిచేస్తుంది. దీనివల్ల మెడ నొప్పి వస్తుంది.
కారణాలు
మెడ కండరాలుఒత్తిడికి లోనవడం, సెర్వికల్ స్పాండిలోసిస్, సెర్వికల్ డిస్క్ ప్రొలాప్స్, సెర్వికల్ ఫ్రాక్చర్స్, ధూమపానం వంటి కారణాలతో పాటు వంశపారపర్యంగా సంక్రమించడం జరుగుతుంది. టి .బి వలన ఎముకలలో మార్పులు చోటుచేసుకున్నప్పుడు, సరియైన భంగిమలో కూర్చోకపోవడం వల్ల, అధిక బరువులు ఎత్తే వారిలో ఈ సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది. దీనివల్ల సి1, సి2, సి3, సి4,సి5, సి6, సి7 వర్టిబ్రాలలో సమస్యలు ఏర్పడతాయి. ఈ డిస్క్‌లలో సమస్యల వల్ల తలనొప్పి, మెడ నొప్పి, తల తిరగడం, మెడ బిగుసుకుపోవడం, చేతులలో, కాళ్లలో తిమ్మిర్లు రావడం, స్పర్శ తగ్గిపోవడం, నడవటానికి ఇబ్బంది కలగడం, మల, మూత్ర విసర్జనలో నియంత్రణ కోల్పోవడం, మెడ కండరాలు బలహీనపడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
సయాటికా
వాహనాలపై ఎక్కువ ప్రయాణం చేసే వారిలోనూ ఈ సమస్య కనిపిస్తుంది. వాహనాలు గోతుల్లో పడినపుడు, స్పీడ్ బ్రేకర్ల దగర వేగంగా వెళ్లినపుడు డిస్క్‌లపైన ఒత్తిడి పడి సయాటికా నొప్పి వస్తుంది. సయాటికా వల్ల నడుంనొప్పి, కాళ్ల వేళ్ల వరకు నొప్పి విస్తరించడం, తిమ్మిర్లు, స్పర్శ తగ్గిపోవడం, వంగినా, లేచినా నొప్పి ఎక్కువగా ఉండటం, అరికాళ్లలో మంటలు, పక్కకు వంగి నడవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో డిస్క్ మధ్యలో దెబ్బతిని లైంగిక శక్తి తగ్గిపోతుంది. మల, మూత్రవిసర్జనపై నియంత్రణ పోతుంది.
నిర్ధారణ
ఎక్స్‌రే, సిటి స్కాన్, ఎమ్ఆర్ఐ స్కాన్, సి.బి.పి, సి.ఎస్.ఎఫ్ వంటి పరీక్షలు చేయించడం ద్వారా డిస్క్‌లలోని సమస్యలను గుర్తించవచ్చు.



హోమియో చికిత్స
శాస్త్రీయతో కూడిన హోమియో చికిత్స వల్ల ఆపరేషన్ అవసరం లేకుండానే నొప్పులను తగ్గించవచ్చు. సర్జరీ అనేది కొన్ని రకాల వ్యాధులకు ఉపయోగించే టెక్నిక్ మాత్రమే. సర్జరీ వల్ల ఆటంకం కలిగించే వాటిని నిర్మూలించడానికి ఆస్కారం ఉంటుందే తప్ప వ్యాధి కారకాన్ని నిరోధించుటకు వీలుకాదు. కానీ హోమియో వైద్యంలో 60 శాతం పైగా కేసులను సర్జరీ అవసరం లేకుండా మందులతో తగ్గించవచ్చు. హోమియో మందులు వాడటం ద్వారా అన్ని రకాల నొప్పులను దూరం చేసుకోవచ్చు. నొప్పి తగ్గకుండా ఉన్నప్పుడు అనుభవజ్ఞులైన హోమియో వైద్యున్ని కలిసి చికిత్స తీసుకుంటే నొప్పి నుంచి శాశ్వత విముక్తి లభిస్తుంది.
పరిష్కార మార్గాలు
విశ్రాంతి తీసుకోవాలి. అలా అని కదలకుండా ఉండటం మంచిది కాదు. కండరాలు బలహీనపడే అవకాశం ఉంటుంది. అధిక బరువును తగ్గించుకోవాలి. ఒకే భంగిమలో కూర్చోవద్దు. వారంలో ఐదు రోజులు వ్యాయామం, నడక చేయాలి. సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. అధిక బరువులు మోయకూడదు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top