బ్రహ్మకపాలం బదరీనాధ్‌లో వుంది. బ్రహ్మ దేవుడికి మొదట అయిదు తలలు ఉండేవట.
ఒకసారి శివుడికి ఎందుకో బ్రహ్మదేవుని మీద కోపం వచ్చి ఒక తల నరికి వేశాడట.
అది బ్రహ్మ హత్యాదోషం కాబట్టి ఆ తల అలాగే శివుని చేతికి అతుక్కుని
ఉండిపోయిందట. ఆయన దానిని వదిలించుకోవ డానికి అనేక క్షేత్రాలు తిరుగుతూ
ఉండగా, చివరకు ఈ బదరీనాధ్ వచ్చేటప్ప టికి ఊదిపోయిందట. బదరీనాధ్‌లోని ఆలయం
అలకనంద అనే నది ఒడ్డునే ఉంది. ఆలయం దగ్గర నుంచి నది ఒడ్డు వెంటే, పొడవుగా
ఉన్న మెట్లమీదుగా నడుచుకుంటూ సుమారు 50 గజాలు వెళితే, అక్కడ నది ఒడ్డు పైన
సుమారు పది అడుగుల పొడుగు, ఆరు అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల మందం ఉన్న ఒక
బండ ఉంది. అదే మనం చెప్పుకునే బ్రహ్మకపాలం. ఆ బ్రహ్మ కపాలం దగ్గర
పితృదేవతలకు శ్రాద్ధ కర్మ నిర్వర్తిస్తే, వారికి స్వర్గప్రాప్తి కలుగు
తుందని విశ్వాసం. అక్కడే ఒక రేకుల షెడ్డు ఉంది. పితృకర్మ చేయదలచు కు
న్నవారిని అక్కడ ఉండే పురోహితులు, ఆ షెడ్డులో కూర్చోబెట్టి చేయించి, వారి
దగ్గరి నుంచి సుమారు మూడు వందల రూపాయలు తీసుకుంటారు.
పితృదేవతలకు మోక్షమిచ్చే... బ్రహ్మకపాలం
teluguLifestyle Editor
3:02:00 PM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో గత కొన్నేళ్లుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.