కిడ్నీలో రాళ్ళు అనగానే ఆపరేషన్ ఒక్కటే మార్గం అని చాలా మంది భావిస్తుంటారు.కాని ఆపరేషన్ లేకుండా రాళ్ళు తయారయ్యే శరీరగుణాన్ని మార్చే విధానాలు

కిడ్నీలో రాళ్ళు అనగానే ఆపరేషన్ ఒక్కటే మార్గం అని చాలా మంది భావిస్తుంటారు. నిజానికి ఆపరేషన్ చేసి రాళ్ళు తీసివేసినా మళ్లీ తయారవుతూనే ఉంటాయి. అందుకే రాళ్ళు వాటంతట అవే పడిపోయేలా చేయడమే కాకుండా రాళ్ళు తయారయ్యే శరీరగుణాన్ని మార్చే హోమియో చికిత్సను ఎంచుకోవడం ఉత్తమం.

ఎక్కువ మందిలో కనిపించే సమస్య కిడ్నీలో స్టోన్స్. తీసుకునే ఆహారం, శరీరతత్వం వంటివి స్టోన్స్ ఏర్పడటానికి కారణమవుతున్నాయి. మూత్రపిండాల్లో రాళ్ళు గట్టిగా క్రిస్టల్ రూపంలోఉంటాయి. ఇవి మూత్రపిండాల్లో గానీ, మూత్రనాళాల్లోగానీ ఏర్పడతాయి. కిడ్నీలో రాళ్ళు ఏర్పడినట్లయితే నెఫ్రోలిథియాసిస్ అని, మూత్రనాళాల్లో ఉంటే యూరోలిథియాసిస్ అని అంటారు. కిడ్నీలో రాళ్ళు ఎవరిలోనైనా ఏర్పడవచ్చు.

అయితే స్త్రీలలో కంటే పురుషులలో ఎక్కువగా ఏర్పడతాయి. 20 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సున్న వారిలో ఈ సమస్య కనిపిస్తుంది. 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సున్నప్పుడు కిడ్నీ స్టోన్స్ ఏర్పడితే భవిష్యత్తులో మళ్లీ మళ్లీ రావడానికి అవకాశాలుంటాయి. ఒకటి కంటే ఎక్కువ స్టోన్స్ ఏర్పడినపుడు కూడా సమస్య పునరావృతమయ్యే అవకాశం ఉంటుంది.
కారణాలు
గౌట్ వ్యాధి ఉన్న వారిలోనూ, రక్తంలో యూరిక్ఆసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వారిలోనూ కిడ్నీ స్టోన్స్ ఏర్పడతాయి. గర్భిణిగా ఉన్న సమయంలోనూ ఏర్పడే అవకాశం ఉంటుంది. మూత్రం సాంద్రత పెరిగినా, వాల్యూమ్ తగ్గినా స్టోన్స్ ఏర్పడతాయి. మంచినీరు తక్కువగా తాగే వారిలోనూ, కొన్నిరకాల యూరినరీ ఇన్‌ఫెక్షన్స్‌తో బాధపడుతున్న వారిలోనూ మూత్రపిండాల్లో రాళ్ళు తయారుకావడానికి ఆస్కారం ఉంది.

మెటబాలిక్ అబ్‌నార్మాలటిస్ ఉన్నా స్టోన్స్ ఏర్పడవచ్చు. హైపర్ థైరాయిడిజమ్, సిస్టిన్యూరియా, రీనల్ ట్యూబ్యులార్ అసిడోసిస్ ఉన్న వారిలో ఈ సమస్య కనిపిస్తుంది. అధిక రక్తపోటు, డయాబెటిస్‌తో బాధపడుతున్నప్పుడు, జీర్ణవ్యవస్థకు ఆపరేషన్‌లు  జరిగినపుడు, కొన్ని రకాల మందులు ముఖ్యంగా డైయురెటిక్స్, కాల్షియమ్ ఉన్న మందులు కిడ్నీ స్టోన్స్‌కు కారణమవుతాయి. వంశపారపర్యంగా ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి.
ఆహారమూ కారణమే
మాంసాహారం, చక్కెర , ఉప్పు ఎక్కువగా తీసుకోవడం కిడ్నీ స్టోన్స్‌కు కారణమవుతాయి. విటమిన్ డి సప్లిమెంట్లు ఎక్కువగా తీసుకున్నా, పాలకూర ఎక్కువగా తిన్నా ఆక్సలేట్ స్టోన్స్ ఏర్పడటానికి అవకాశం ఉంటుంది.
లక్షణాలు
కిడ్నీలో రాళ్ళు 4 మి.మీల సైజులో ఉన్నప్పుడు ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. కొంచెం సైజు పెరిగినపుడు తీవ్రమైన నడుం నొప్పి, కడుపు నొప్పి, మూత్రంలో రక్తం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో 4 మి.మీల సైజులో ఉన్నా నడుం భాగంలో నొప్పి ఉంటుంది. కిడ్నీ స్టోన్ సైజు పెరిగినపుడు వాంతులు, వికారం, కూర్చున్నా, పడుకున్నా నొప్పి తగ్గకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మూత్రంలో మంట, చలి జ్వరం కూడా ఉంటుంది.
నిర్ధారణ
పైన చెప్పిన లక్షణాలు ఉన్నప్పుడు కిడ్నీ స్టోన్స్‌ను నిర్ధారించుకోవడానికి స్కానింగ్ చేయించుకోవాలి. ఈ పరీక్ష ద్వారా స్టోన్స్ ఉన్న ప్రదేశం, సైజు తెలుసుకోవచ్చు. కొన్నిరకాల రక్తపరీక్షలు, యూరిక్ ఆసిడ్ లెవెల్స్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.

ఆపరేషన్ ఒక్కటే మార్గమా?
మూత్రపిండాల్లో రాయి మూలంగా తీవ్రమైన నొప్పి ఉంటుంది. చాలామంది నొప్పిని భరించలేక ఆపరేషన్‌కు సిద్ధపడుతుంటారు. ఆపరేషన్ తప్ప వేరే మార్గం లేదని కూడా చాలా మంది భావిస్తుంటారు. కానీ ఆపరేషన్ చేసి రాళ్ళు తొలగించినా మళ్లీ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆహార నియమాలు పాటించని వారిలో సర్జరీ చేసి తీసివేసినా 6 నుంచి 8నెలల్లో తిరిగి ఏర్పడటానికి ఆస్కారం ఉంది. కాబట్టి సర్జరీకి వెళ్లేముందు అన్ని విషయాలు ఆలోచించుకోవాలి.
హోమియో చికిత్స
ఆపరేషన్ అవసరం లేకుండా మందులతో రాళ్ళు పడిపోయేలా చేయడం హోమియో వైద్య విధానం ప్రత్యేకత. హోమియో చికిత్స వల్ల మూత్ర నాళ మార్గం వెడల్పు పెరిగి రాయి సులువుగా బయటకు వచ్చేస్తుంది. హోమియో వైద్య విధానంలో శరీరంలో రాళ్ళు తయారయ్యే గుణాన్ని మార్చేలా చికిత్స అందించడం జరుగుతుంది. దీనివల్ల రాళ్ళు మళ్లీ మళ్లీ ఏర్పడటం జరగదు. శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. హోమియో మందులు వాడుకుంటూ ఆహార నియమాలు పాటిస్తే కిడ్నీ స్టోన్స్ సమస్యను సులువుగా అధిగమించ వచ్చనడంలో సందేహం లేదు. కిడ్నీలోస్టోన్స్ ఉన్నాయని తెలిసిన వెంటనే అనుభవజ్ఞులైన వైద్యుని పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే సరిపోతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top