ఇన్‌హేలర్స్‌పై ఉండే అపోహలు... వాస్తవాలు

ఆస్తమా గురించి, దానికి ఉపయోగించే ఇన్‌హేలర్స్ గురించి చాలా అపోహాలు ఉన్నాయి. నిజానికి నోటిలోకి తీసుకునే మందుల కంటే ఇన్‌హేలర్స్ చాలా సురక్షితమైనవి. అందులో మందు లక్ష్యాన్ని తాకేలా చేస్తారు. అందుకే నోటిలోకి తీసుకునే మందులతో వచ్చే చాలా దుష్ర్పభావాలను ఇన్‌హేలర్స్‌తో తగ్గించవచ్చు. ఇన్‌హేలర్స్‌పై ఉండే అపోహలు... వాస్తవాలు గురించి

అపోహ

చిన్నతనంలో ఆస్తమా వస్తే పెద్దయ్యాక కూడా కొనసాగుతుంది.

ఆస్తమా వచ్చినప్పుడు నిమ్మ, నారింజలాంటి పళ్లు, కొబ్బరి, దోస, సొరకాయ, పాలు... ఇలాంటివాటిని తీసుకోవడం నిలిపివేయాలి.


అన్ని మందులు ఉపయోగించాక చివరి ఆప్షన్‌గా ఇన్‌హేలర్స్ వాడతారు.


ఇన్‌హేలర్స్ వాడటం అన్నది అలవాటుగా మారుతుంది.


ఇన్‌హేలర్స్ వాడటం వల్ల సైడ్‌ఎఫెక్ట్స్ ఎక్కువ. 


వాస్తవం
చిన్నప్పుడు వచ్చే ఆస్తమా చాలామందిలో దాదాపు తగ్గుతుంది.

ఏ ఆహారం వల్ల అలర్జీ కలిగి అది ఆస్తమాకు దారితీస్తోందో, దాన్ని మాత్రమే నివారిస్తే సరిపోతుంది. మిగతావన్నీ మామూలుగానే తీసుకోవచ్చు. రోగనిరోధకశక్తి పెంపొందించడానికి అన్నీ తీసుకోవాలి కూడా.


మొట్టమొదటి చికిత్స(ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్‌మెంట్)గా ఇన్‌హేలర్స్ వాడతారు.


ఇన్‌హేలర్స్ వాడటం అన్నది అలవాటుగా మారదు.


ఇన్‌హేలర్స్ వాడటం వల్ల సైడ్‌ఎఫెక్ట్స్ బాగా తక్కువ.
 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top