చాలా మందిలో పప్పులు తింటే గాయూలకు చీము పడుతుందనేది ఒక అపోహ- వాస్తవాలు

చాలా మందిలో పప్పులు తింటే గాయూలకు చీము  పడుతుందనేది ఒక అపోహ. నిజానికి పప్పుధాన్యాలు గాయూన్ని వేగంగా వూన్పేందుకు సహాయుం చేస్తారు.  పోషకవిలువల పరంగా చూస్తే వూంసాహారంలో ఏ పదార్థం ఎక్కువగా ఉంటుందో అలాంటి పోషకపదార్థాలే పప్పుదినుసుల్లోనూ ఉంటాయి . అందువల్లనే శాకాహారంలో లభించే ప్రోటీన్లలో పప్పులదే అగ్రస్థానవుని చెప్పవచ్చు. గాయుం వేగంగా వూనుబట్టడానికి జరగాల్సిన కణవిభజన ప్రక్రియుకు ఈ ప్రోటీన్లు ఎంతో అవసరం.

గాయూనికి చీము  పట్టేలా చేస్తుందన్న అపోహ కొద్దీ కొంతవుంది శస్త్రచికిత్స తర్వాత ఆ గాయుం ఎక్కడ చీము  పడుతుందో అన్న భయుంతో పప్పులను తినవద్దని చెబుతుంటారు. నిజానికి చీము  పట్టడం అన్న ప్రక్రియు బాక్టీరియుల్ ఇన్ఫెక్షన్లతో వచ్చే ఇన్‌ఫ్లమేషన్ వల్ల జరుగుతుంది. అంతేగాని పప్పు ధాన్యాల వల్ల కాదు. పైగా భారతీయుల్లో శాకాహారం తినడమే ఎక్కువ కావడం వల్ల వునకు అవసరమైన ప్రోటీన్లను అందించడంలో ప్రధానమైన భూమిక పప్పుధాన్యాలే పోషిస్తాయి. 



అందుకే ఏదైనా గాయుం తగిలి వూనుబట్టే దశలో ఉన్నప్పుడూ, సర్జరీ వంటివి జరిగినప్పుడూ వేగంగా కోలుకోవడానికి పప్పు ధాన్యాలను తప్పుకుండా తీసుకోవాలి. అంతేకాదు... పప్పుల్లో పీచు పదార్థం ఎక్కువ. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తారు. ప్రొటిన్లతో పాటు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు (పిండిపదార్థం), విటమిన్లు, ఖనిజ లవణాలు కూడా ఎక్కువే. పప్పు ధాన్యాలలో ఐరన్, బిటమిన్ బి కాంప్లెక్స్ కూడా ఎక్కువే. ఒక్క సోయూబీన్ మినహాయిస్తే... మిగతా పప్పు ధాన్యాలన్నింటిలోనూ కొవ్వు పదార్థాల పాళ్లు చాలా తక్కువే. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top