హృద్రోగ సమస్యలను సులభంగా గుర్తించేందుకు వీలుగా ఎలాంటి నొప్పి లేకుండా యాంజియోగ్రామ్ చేసే పద్ధతులు

మధుమేహం, ధూమపానం, అధిక కొలెస్ట్రాల్, కుటుంబ చరిత్ర వల్ల హృద్రోగుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. గుండె రక్తనాళాల్లో 90 శాతం బ్లాక్‌లు ఏర్పడటం వల్ల రక్తసరఫరా తగ్గిపోతోంది. కారణాలేమైనా చాలా మందికి సైలెంట్ కార్డియాక్ సమస్యలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హృద్రోగ సమస్యలను సులభంగా గుర్తించేందుకు వీలుగా ఎలాంటి నొప్పి లేకుండా యాంజియోగ్రామ్ చేసే పద్ధతులు.

గుండె సమస్యలను గుర్తించేందుకు వివిధ రకాల పరీక్షలు చేస్తుంటాం. సాధారణంగా ఏ వైద్యుడి వద్దకెళ్లినా గుండె పరిస్థితిని తెలుసుకునేందుకు ఈసీజీ, 2డి ఇకో, టీఎంటీ, కొలెస్ట్రాల్ (లిపిడ్ ప్రోఫైల్) పరీక్షలు చేస్తుంటారు. కాని ఈ నాలుగు పరీక్షల్లో నార్మల్ అని వస్తే ఇక హృద్రోగ సమస్య లేదని నిర్ధారణకు రావటం సరైనది కాదు. హృద్రోగ ముప్పు ఉన్న వారిలో ఈ నాలుగు పరీక్షలు చేయించి సమస్య లేదని నిర్ధారించలేం. అలాంటపుడు ఎలాంటి నొప్పి లేకుండా సులభంగా ఓపీ పద్ధతిలో చేసే యాంజియోగ్రామ్ పరీక్షలు నేడు అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల గుండె వాస్తవ పరిస్థితిని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు.

సాధారణంగా యాంజియోగ్రామ్ రెండు రకాలుగా చేస్తారు. కాలికి చేసే యాంజియోగ్రామ్‌ను ఫెమరల్ యాంజియోగ్రామ్ అంటారు. చేతి రక్తనాళానికి చేసే పరీక్షను రేడియల్ యాంజియోగ్రామ్ అంటారు.

ఫెమరల్ యాంజియోగ్రామ్ :

 కాలికి ఉన్న పెద్ద రక్తనాళం ద్వారా ట్యూబ్ పంపించి ఈ పరీక్ష చేస్తారు. పెద్ద రక్తనాళానికి రంధ్రం చేయటం వల్ల రక్తం ఎక్కువ స్రవించే అవకాశాలున్నాయి. రోగిని నిటారుగా పడుకోబెట్టి పరీక్షిస్తారు. ఈ విధానంలో పరీక్షించటానికి రోగిని ఆసుపత్రిలో అడ్మిట్ చేయాలి. పరీక్ష అనంతరం రోగికి కనీసం 12 గంటలు విశ్రాంతి అవసరం. ఇటీవల కాలి వద్ద కంటే చేతికి ఉన్న రక్తనాళానికి యాంజియోగ్రామ్ పరీక్షలు చేయడానికి ప్రాధాన్యమిస్తున్నారు.
 

రేడియల్ యాంజియోగ్రామ్ :
 చేతికి ఉన్న రక్తనాళానికి చేసే యాంజియోగ్రామ్ 2 మిల్లీమీటర్ల ట్యూబ్‌ను గుండెకు పంపించి పరీక్షిస్తారు. ఈ ట్యూబ్‌లోనే మరో ట్యూబ్ పంపిస్తారు. దీనివల్ల రోగికి పరీక్ష అనంతరం చేతినొప్పి రావచ్చు. అందువల్ల ఇటీవల రోగికి ఎలాంటి నొప్పి కలగకుండా 1.2 మిల్లీమీటర్ల ట్యూబ్‌ను చేతి నుంచి గుండెలోకి నేరుగా పంపించటం ద్వారా పరీక్షిస్తారు. దీనివల్ల రోగికి బ్లీడింగ్ కాదు. ఒక గంట ఫాస్టింగ్‌లో ఓపీ ప్రోసిజర్‌లో ఈ పరీక్షను సులభంగా చేయవచ్చు. విదేశాల్లో ఉద్యోగులు లంచ్ బ్రేక్‌లోకొచ్చి రేడియల్ యాంజియోగ్రామ్ పరీక్ష చేయించుకొని ఆ వెంటనే సాధారణ విధులకు హాజరు అవుతున్నారు. రోగికి ఎలాంటి నొప్పి కలగకుండా ఈ యాంజియోగ్రామ్ చేయవచ్చు.

యాంజియోప్లాస్టీ: 

1.5 మిల్లీమీటర్ల పరిమాణం గల సన్నని గైడింగ్ కాథిటర్‌ను చేతి రక్తనాళం నుంచి గుండెలోకి పంపించి యాంజియోప్లాస్టీ చేసే ఆధునిక పద్ధతి నేడు అందుబాటులోకి వచ్చింది. యాంజియోప్లాస్టీ గైడ్‌వైరు ద్వారా బెలూన్ పంపించి బ్లాక్‌ను బ్లాస్ట్ చేస్తారు. బ్లాస్ట్ చేసిన రక్తనాళం వద్ద స్టెయిన్‌లెస్‌స్టీలు లేదా క్రోమియం కోబాల్ట్ మెడికేటెడ్ స్టంట్‌ను వేస్తారు. స్టెయిన్‌లెస్ స్టీలు స్టంట్ తొందరగా మూసుకుపోయే అవకాశాలున్నందున ఇటీవల మెడికేటెడ్ స్టంట్‌లను ఎక్కువగా వాడుతున్నారు.
 

లక్షణాలు :
 ఛాతీ బరువుగా అనిపించినా, కళ్లు తిరిగినా, గుండె దడ వచ్చినా, మెట్లు ఎక్కేటపుడు ఆయాసం వచ్చినా హృద్రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. హృద్రోగులు ఉన్న కుటుంబంలో జన్మించినా, పదేళ్లుగా మధుమేహం ఉన్నా, ధూమపానం అలవాటు ఉన్నా, అధిక కొలెస్ట్రాల్ ఉన్న వారు గుండె పరీక్షలు విధిగా చేయించుకోవాలి.

అధిక రక్తపోటు, నరాల సమస్యలున్నా పరీక్షలు చేయించుకోవటం మంచిది. గుండె సమస్యను గుర్తించేందుకు ఈసీజీ, 2డి ఇకో, టీఎంటీ, లిపిడ్‌ప్రోఫైల్‌ల కంటే ఖచ్చితంగా నిర్ధారించేందుకు యాంజియోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలి. ప్రాథమిక పరీక్షల్లో సాధారణమని రిపోర్టులు వచ్చిన కేసుల్లోనూ హృద్రోగ సమస్యలు ఉన్నాయని యాంజియోగ్రామ్ పరీక్షలో తేలింది.

బైపాస్ సర్జరీ :

 గుండెలోని మూడు రక్తనాళాల్లోనూ రెండు,మూడు చోట్ల బ్లాక్స్ ఏర్పడి రక్త ప్రసరణలో అంతరాయం వాటిల్లినపుడు యాంజియోప్లాస్టీ కంటే బైపాస్ సర్జరీ చేయించుకోవటం మేలు. లెఫ్ట్ యాట్రియర్ డీసెంటింగ్ ఆర్టరీ, లెఫ్ట్ సర్గమ్ ఫ్లెక్స్ ఆర్టరీ, రైట్ కరోనరీ ఆర్టరీల్లో రెండు లేదా మూడు బ్లాక్స్ ఏర్పడితే బైపాస్ ఆపరేషన్ చేయించుకోవాలి. రక్త నాళాల్లో పెద్ద బ్లాక్స్ ఏర్పడినా బీటింగ్ హార్ట్ సర్జరీ చేయించుకోవటమే మంచిది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top