మీకు అతి పెద్ద ఆన్‌లైన్ బుక్‌స్టోర్ తెలుసా ?

''అభిమాన రచయిత రాసిన కొత్త పుస్తకం చదవాలని మనసు ఆరాటపడుతోంది. కానీ పుస్తకాల షాపుకెళ్ళి కొనుక్కురావటానికి సమయం దొరకడం లేదు'' అని చాలా మంది మదనపడుతూ ఉంటారు. అయితే మీకు ఆ బెంగక్కర్లేదు. మీలాంటి వారికోసమే ఆన్‌లైన్ బుక్‌స్టోర్ ప్రారంభమైంది. HOMESHOP18.COM కోటిపుస్తకాలతో అతిపెద్ద అన్‌లైన్ బుక్‌స్టోర్‌ను ప్రారంభించింది. ఇందులో 2 వేల కేటగిరీల్లో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.

డిజిటల్ యుగంలో కూడా పాత పుస్తకాలకు పాపులారిటీ ఏ మాత్రం తగ్గడం లేదన్న విషయం తెలిసిందే. పాత పుస్తకాలకోసం బుక్‌హౌజ్‌ల చుట్టూ తిరుగుతున్న వారిని మనం చూస్తూనే ఉంటాం. వీరికి కూడా ఈ ఆన్‌లైన్ బుక్‌స్టోర్ చాలా ఉపయోగపడుతుంది. కావలసిన పుస్తకాన్ని సెర్చ్ చేయడం కూడా తేలిక. ఆన్‌లైన్ పేమెంట్ చేయలేని వారు క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. పుస్తకాన్ని ఇంటి దగ్గరకు తీసుకొచ్చి అందజేసినందకు షిప్పింగ్ ఛార్జీ వసూలు చేయరు. పుస్తకప్రియులకు ఇది శుభవార్తే కదూ.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top