ప్రసిద్ధ పర్యాటక క్షేత్రం ఖాట్మండుకు వెలా వెళ్లాలి? అక్కడ చూడదగిన విశేషాలేమిటి?

ప్రపంచంలోని సుందర నగరాల్లో ఖాట్మండు ఒకటి. పర్యాటకులను, తీర్థయాత్రికులను ఆకర్షించే ప్రదేశం. ఇది నేపాల్ రాజధాని. ఈ నగరం మొత్తం కొండలు, లోయలతో నిండి ఉంటుంది. సంధ్యాసమయంలో పర్యటించే వారికి మనోహర అద్భుత చిత్రరాజాన్ని వీక్షింప చేస్తుంది. ఖాట్మండుకి సమీపంలో ఉన్న మరో ప్రసిద్ధిగాంచిన పుణ్యధామం స్వయంభూనాథ్ ఆలయం. ఇక్కడ బుద్ధభగవానుడు కొలువుదీరి ఉంటాడని నేపాలీయుల విశ్వాసం. ఈ ఆలయానికి సమీపంలోనే ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన ఆలయం పశుపతినాథ ఆలయం ఉంది.

ఈ ఆలయం అపర కర్మలకు విశిష్టమైన ప్రదేశం అని నమ్ముతారు. ఇక్కడ శివుడు పశుపతినాథుడుగా పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయానికి 35 కిలోమీటర్లదూరంలో ఉన్న సుందర ప్రదేశం నాగర్‌కోట్. ఇది మూడువేల మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఖాట్మండులో చలి ఎక్కువ. ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలకు పడిపోతుంది.


ఖాట్మండు సంస్కృతిసంప్రదాయాలకు ఆలవాలమై వెలుగొందుతున్న ఆలయాల్లో టెంపుల్ ఆఫ్ లివింగ్ గాడెస్, దర్బార్ స్వ్కేర్, కుమారి ఆలయాలు ముఖ్యమైనవి. వీటన్నింటినీ కవర్ చేస్తే ఖాంట్మండు పర్యటనను సమగ్రంగా చేసినట్లు. నేపాల్‌లో ప్రకృతి రమణీయతను ప్రదర్శించే మంచుకొండలు, అడవులే కాదు... సుందరమైన నదులు కూడా ఉన్నాయి. ఈ దేశంలో త్రిసూలి నది, జాగ్మతి, రప్తీ నదులు ప్రవహిస్తున్నాయి. ఖాట్మండులో దక్షిణకాళీ, భరత్‌పూర్ తదితర ప్రాంతాలనూ చూడదగినవి.
 

ఖాట్మండు చేరడానికి... గోరఖ్‌పూర్ వరకు రైల్లో వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెళ్లడం ఒక పద్ధతి. హైదరాబాద్, ఢిల్లీల మీదుగా విమానంలో వెళ్లి ఖాట్మండులో దిగడం ఒక పద్ధతి. భూతల స్వర్గంగా కనిపించే ఖాట్మండు నగరాన్ని దర్శించుకుని కావల్సినంత మానసిక ఆనందాన్ని పొందవచ్చు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top