కంటికి చాలా సందర్భాల్లో గాయాలు అవుతాయి.ఆ గాయాలను నిర్లక్ష్యం చేయకూడదు, వాటికి జాగ్రత్తలు

కంటికి చాలా సందర్భాల్లో గాయాలు అవుతాయి. బంతి, షటిల్‌కాక్ వంటివి తగిలినప్పుడు, పిల్లలు బాణాల వంటి పదునైన వస్తువులతో ఆడుకుంటున్నప్పుడు, రాళ్లు కొట్టే సమయంలో, చెక్కపేడు వంటివి ఎగిరి పడినప్పుడు, వెల్డింగ్ చేసేటప్పుడు, బట్టీలలో పనిచేసేటప్పుడు, వర్క్‌షాపుల్లో ఏదైనా పదార్థాలు విసురుగా వచ్చినప్పుడు కంటికి గాయాలు అయ్యే అవకాశాలు ఎక్కువ. 


రోడ్డు నిబంధనలను సక్రమంగా పాటించకపోవడం వల్ల కంటికి నేరుగా ఏదైనా తాకడంతో ప్రమాదానికి గురికావచ్చు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల కూడా ప్రమాదం జరగవచ్చు. కంటికి గాయం అయినప్పుడు పైకి కనిపించకపోయినా, చూపు బాగానే ఉన్నట్లు అనిపించినా డాక్టర్ చెప్పేవరకు క్రమం తప్పకుండా ఫాలోఅప్ అవసరం. కంటికి గాయం అయితే ఆ తర్వాత ఆలస్యంగా కనిపించే కొన్ని పరిణామాలు కనిపించవచ్చు.

జాగ్రత్తలివి...

ముందుజాగ్రత్త చర్యగా పనిపాటల్లో కంటికి రక్షణ ఇచ్చే అద్దాలు వాడటం మంచిది. ఈ కిందపేర్కొన్న అంశాలపై అవగాహన పెంచుకుంటే దాదాపు 90 శాతం కంటి ప్రమాదాలను నివారించవచ్చు. 



వర్క్‌షాపుల్లో పనిచేసేవారు, రాళ్లు కొట్టేవారు, వ్యవసాయపనులు చేసేవారు కంటికి రక్షణగా ఉండేలా (పాలీ కార్బొనేట్ లేదా ప్లాస్టిక్) అద్దాలు ధరించాలి. దాంతో ఎగిరివచ్చే వస్తువులతో కంటికి గాయం కాకుండా నివారించవచ్చు.

కంటికి గాయం అయినప్పుడు చేయాల్సిన ప్రథమచికిత్సపై అవగాహన పెంచుకోవాలి.


ఉత్సవాల్లో, వేడుకలప్పుడు పిల్లల ఆటలపై తల్లిదండ్రులు దృష్టిపెట్టాలి.


కంటికి గాయం అయినప్పుడు గాయపడ్డవారిని ఆసుపత్రికి తీసుకెళ్లడంలో ఆలస్యం చేయకూడదు.


పనిపాటల్లో కంటి రక్షణ కల్పించేందుకు అవసరమైన నిబంధనలు పాటించేలా పర్యవేక్షకులు జాగ్రత్తలు తీసుకోవాలి.


నిర్లక్ష్యం వద్దు...
కంటికి భౌతికంగా గాయం అయినప్పుడు ... వెంటనే శుభ్రమైన మెత్తటి గుడ్డ సహాయంతో రెండు కళ్లనూ మూసి ఉంచాలి. కనుగుడ్ల కదలికను వీలైనంతవరకు నివారించాలి. సాధ్యమైనంత త్వరగా డాక్టర్‌కు చూపించాలి. కంటికి గాయం అయినప్పుడు స్వయంగా పరీశీలించుకోవడం, సొంత చికిత్స వంటివి చేయకూడదని గుర్తుంచుకోవాలి. దగ్గర్లోని కంటి డాక్టర్‌తో ప్రథమ చికిత్స తీసుకుని, వారి సలహా మేరకు ఆ తర్వాత నిపుణులకూ చూపించుకోవాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top