జీర్ణసంబంధ సమస్యలకు హోమియో ఔషధాలు

జీర్ణసంబంధ సమస్యలకు హోమియో ఔషధాలు చక్కగా పనిచేస్తాయి. వ్యాధి మూలకారణాన్ని తొలగించడం ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడితే అల్సర్ సమస్య చాలా సులభంగా తగ్గిపోతుంది. ఈ కింది ఔషధాలు అల్సర్ చికిత్సలో బాగా పనిచేస్తాయి.

నక్స్‌వామికా : అన్ని రకాల జీర్ణకోశ వ్యాధులను నివారించేందుకు ఈ ఔషధం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కాఫీ, టీ, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అల్సర్ సమస్యల బారినపడినవారు ఈ మందు వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

పల్సటిల్లా : కొవ్వుపదార్థాలను తినడం వల్ల ఇబ్బంది పడేవాళ్లు, జీర్ణశక్తి తక్కువగా ఉన్నవాళ్లు ఈ మందు ఉపయోగించవచ్చు.

హైడ్రెస్టిస్ : దీర్ఘకాల జీర్ణకోశ వ్యాధులకు ఈ మందు బాగా పనిచేస్తుంది. జీర్ణాశయ క్యాన్సర్ బారినపడిన వారి ఈ ఔషధం వాడవచ్చు.

యాంటిమ్‌స్క్రడ్ : ఆహారం తీసుకున్న చాలా సేపటి వరకూ కడుపు ఉబ్బరంగా ఉండే వాళ్లకు ఇది దివ్యౌషధం.

కార్బోవెజ్ : గ్యాస్ వెళ్లిపోయేంత వరకు కడుపు పైభాగం ఉబ్బరంగా ఉండే సమస్యకు ఇది మంచి మందు.


కుర్చి: అమీబియాసిస్ సమస్యను నివారించేందుకు ఇది మంచి టానిక్.

నాట్‌ఫోస్ : ఎసిడిటీని నివారిస్తుంది. కడుపులో మంటను తగ్గిస్తుంది.
 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top