ఇవి కావాలి...
వంకాయలు : 1/4 కిలో
జీడిపప్పు : 100 గ్రా
ఎండుకొబ్బరి తురుము : 1/2 కప్పు
పోపుసామాను : తగినంత
కారం, ఉప్పు : సరిపడ
నూనె : తగినంత
ఇలా చేయాలి...
బాండీలో నూనె కాగిన తర్వాత పోపు వేసి దాంట్లో జీడిపప్పు వేపాలి. దాంట్లో తరిగిన వంకాయ ముక్కలు కూడా వేసి ఫ్రైచేసి ఉప్పు, పసుపు వేసి వేగిన తర్వాత ఎండుకొబ్బరి, కారం వేసి బాగా కలిపి ఫ్రై చేసి దించి సర్వ్ చేయాలి. అల్లం పేస్ట్ కలిపితే వేరే టేస్ట్ వస్తుంది. దాంట్లో కొత్తిమీర చల్లితే రుచిగా ఉంటుంది.