కావలసిన పదార్దాలు
టమాటో : అర కిలో (చిన్నవి)
ఉల్లిపాయలు : 3
పచ్చిమిర్చి : 4 కాయలు
కొబ్బరికోరు : 1 కప్పు
మైదా : తగినంత
ఇలా చేయాలి...
టమాటాలని పైన పార్టులో అర అంగుళం కోసి లోపలి గుజ్జు అంతా తీసి రసం గిన్నెలోకి తీయాలి. ఉల్లి, మిర్చి సన్నగా ముక్కలు చేయాలి. బాండీలో కొంచెం డాల్డా వేసి కాగిన తర్వాత ఉల్లి, మిర్చి ముక్కలు వేసి వేపి కొబ్బరికోరు కూడా వేసి సరిపడా ఉప్పు వేసి వేగగానే దింపి దీనిని టమాటాలలో కూరి మూత కోసి నది మైదాతో తడిపి మళ్లీ కదలకుండా అతికించాలి. డాల్డా మరిగించి తయారు చేసుకున్న టమాటాలను ఆ పళంగానే వేసి వేయించి తీయాలి. ముద్దకో టమాట చొప్పున పెట్టుకుని తినాలి.