పిల్లలు పరీక్షల ఒత్తిడి నుంచి రిలాక్స్ అవడానికి, తల్లిదండ్రులు కొన్ని సింపుల్ టెక్నిక్స్‌

ఇంకో నెల రోజుల్లో ఫైనల్ పరీక్షలు. పబ్లిక్ పరీక్షలున్న పిల్లలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. గుట్టలుగా ఉన్న సిలబస్ ఇంకా పూర్తికాలేదని, చదివింది సమయానికి గురుకువస్తుందో లేదోనని, చదివినవి పరీక్షలో వస్తాయో రావో అనే టెన్షన్‌లో ఉంటారు. పిల్లలు పరీక్షల ఒత్తిడి నుంచి రిలాక్స్ అవడానికి, తల్లిదండ్రులు కొన్ని సింపుల్ టెక్నిక్స్‌ని ఫాలో అవమంటున్నారు మనస్తత్వ నిపుణులు.

సమర్థతను బట్టి లక్ష్యం...


ఏ వయసుకైనా రిలాక్సేషన్ అవసరం. అలాగని మరీ లీజర్‌గా వదిలేయకూడదు. కొంత ఒత్తిడి ఉంటేనే పిల్లలకు చదువు విలువ తెలుస్తుంటుంది. అయితే పిల్లల తెలివి తేటలను బట్టి లక్ష్యాన్ని నిర్ధారించాలి. ఎప్పుడూ యాభై, అరవై శాతం మార్కులు వచ్చే పిల్లలను ఈ సారి నూటికి నూరు శాతం వచ్చితీరాలని పోరడం అధిక ఒత్తిడికి లోనుచేసినట్టే అవుతుంది. తల్లిదండ్రుల లక్ష్యాలను పిల్లల మీద రుద్దకూడదు. ఎంతసేపూ చదువు చదువు అని ఏకధాటిగా పోరకూడదు. ప్రతి అరగంటకు ఓ ఐదు నిమిషాల విరామం మెరుగైన ఫలితాలను ఇస్తుంది.. 


పోషకాహారం...

అధిక ఒత్తిడి నుంచి దూరం చేసే శక్తి విటమిన్ ‘సి’కి ఉంటుంది. ఎందుకంటే విటమిన్ ‘సి’లో వ్యాధినిరోధక శక్తిని పెంపొందించే లక్షణాలు ఎక్కువ ఉంటాయి. ఇవి త్వరగా జబ్బుల బారిన పడనివ్వవు. శరీరం ఆరోగ్యంగా ఉంటే మెదడూ ఉల్లాసంగా ఉంటుంది. అందుకని ‘సి’ విటమిన్ సమృద్ధిగా ఉండే నారింజ, క్యాల్షియం, ఐరన్ పాళ్లు అమితంగా ఉండే ఆకుకూరలు, పాలు, ప్రొటీన్లు ఎక్కువ ఉండే పాల ఉత్పత్తులు, గుడ్లు... రోజువారి ఆహారంలో ఉండేలా జాగ్రత్తపడాలి. ఇవన్నీ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతాయి. అలాగే రోజూ రెండు లీటర్ల నీళ్లు తాగడాన్ని ప్రోత్సహించాలి.


వ్యాయామం...


స్ట్రెచింగ్ వ్యాయామాలు ఒత్తిడిని త్వరగా విడుదల చేస్తాయి. నిద్ర లేవగానే చదవమని పోరకుండా పదిహేను నిమిషాలైనా స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయమనండి. ఈ వ్యాయామాల కోసం టీవీ, పుస్తకాలను పరిశీలించవచ్చు. అలాగే ప్రాణాయామం, బ్రీథింగ్ ఎక్సర్‌సైజులు చేయడాన్ని ప్రోత్సహించండి. ఇవి రిలాక్సేషన్‌కి మంచి ఔషధాలు.  



చక్కని నిద్ర కోసం...
గోరువెచ్చని నీటితో స్నానం చేయమనడం మంచిది. పడుకోబోయేముందు వేడి పాలు లేదా హెర్బల్ టీ ఒత్తిడిని దూరం చేసి విశ్రాంతిని కలిగిస్తాయి. అలాగే పడుకోవడానికి పదినిమిషాల ముందు టెక్స్ట్ బుక్స్ కాకుండా ఏదైనా నచ్చిన మ్యాగజైన్‌ను చూడమనాలి. ప్రశాంతతను కలిగించే సంగీతాన్ని వినమనాలి.
తల్లిదండ్రులు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జ్ఞాపకశక్తి పెరగడానికి ఏ వైద్య విధానంలోనూ ఎలాంటి మందులూ లేవు. ఒత్తిడికి లోనయ్యే పిల్లలకు ఎడ్యుకేషన్ కౌన్సెలింగ్ ఉపకరిస్తుంది.సాధన ఎంత చేస్తే అంత జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top