వేసవి కాలం అప్పుడే తన ప్రతాపాన్ని చూపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా
ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాత్రిళ్లు వేడిగాలులతో ప్రజలు
ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని
చిట్కాలు...
సాధ్యమైనంత వరకు ప్రకృతిపరంగా లభించే పానీయాలనే తీసుకోవడం మంచిది. ముఖ్యంగా కొబ్బరిబొండాం తాగడం చాలా మంచిది. గంటగంటకు మంచినీరు తాగాలి. అలాగే పల్చటి మజ్జిగను ఎంత ఎక్కువగా తాగితే అంత మంచిది.
- పండ్ల రసాల విషయానికి వస్తే పుచ్చకాయ, నారింజ, అనాస తదితర పండ్ల రసాలలో నాలుగైదు పుదీనా ఆకులను వేసుకుని తాగితే శరీరం చల్లుబడుతుంది. దప్పిక తగ్గుతుంది.
- కప్పు పెరుగులో మూడు కప్పుల నిష్పత్తిలో నీరు కలుపుకుని బాగా చిలక్కొట్టి కొద్దిగా చక్కెర, రెండు మూడు గులాబీ రేకులు వేసుకుని లస్సీలా చేసుకుని తాగితే వేసవి దాహార్తికి అడ్డుకట్ట వేయవచ్చు.