ఆహారం:
పులుపు, కారం, మసాలాలు, వేపుళ్లు, మినప, శనగపప్పులు... తాత్కాలికంగా మానేయండి. తేలికగా జీర్ణమయ్యే, పీచు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోండి. మీకు మధుమేహ వ్యాధి లేకపోతే సేమ్యా, సగ్గుబియ్యం, కొబ్బరి వంటివాటితో చేసిన పానీయాలు తీసుకొంటే మంచిది. కరివేపాకు, అల్లం, జీలకర్రపొడి, ఇంగువ, కొంచెం ఉప్పు, పుదీనా ఇంకా నిమ్మరసం కలిపిన పలుచని మజ్జిగను తయారుచేసుకొని, మూడుపూటలా తాగండి. నియమిత వేళల్లో ఆహారం తీసుకోండి. రోజూ రెండు చెంచాల నువ్వులపప్పు నమిలి తినండి. ఆకలివేళల్లో టీ, కాఫీలతో కాలక్షేపం చెయ్యొద్దు.
విహారం:
నియమిత వేళల్లో నిద్ర చాలా ముఖ్యం. జాగరణలు చేయొద్దు. యోగాసనాలు లేదా నడక తప్పనిసరిగా చేయండి. ప్రాణాయామం బాగా ఉపయోగపడుతుంది. మానసిక ఒత్తిడులను దూరం చేసుకోవటం చాలా అవసరమని గుర్తుంచుకోండి.
గృహవైద్యం:
జీలకర్ర 50 గ్రా, ధనియాలు 50 గ్రా, సోంపు 50 గ్రా, వాము 10 గ్రా, శొంఠి 10 గ్రా. కలిపి పొడి చేసుకోండి. 3 గ్రాముల మోతాదు పొడిని, నీళ్లలో కలిపి, రోజూ రెండుపూటలా సేవించండి. ఇది జీర్ణకోశ వికారాలలో చాలా వాటికి మంచిది.