కంప్యూటర్‌తోపాటు మెయిల్ ఐడీ, ఇంటర్‌నెట్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ పర్చేజ్ లాంటి ఆన్‌లైన్ లావాదేవీలు సురక్షితంగా జరిపేందుకు ఎలాంటి పాస్‌వర్డ్‌లు పెట్టుకుంటే మంచిది?

కంప్యూటర్ ఆన్‌లైన్ లావాదేవీలు జరిపేందుకు స్ట్రాంగ్ పాస్‌వర్డ్ పెట్టుకోవటం ఎంతో ముఖ్యం. దీనివల్ల మీరు సురక్షితంగా లావాదేవీలు జరుపుకోవచ్చు. సాధారణంగా మనం కంప్యూటర్ ఒపెన్ చేయటానికి, మెయిల్ ఐడీకి, ఆన్‌లైన్ నెట్ బ్యాంకింగ్‌ల కోసం మీరు పాస్‌వర్డ్‌ను పెడుతుంటాం. పాస్‌వర్డ్‌లో క్యారెక్టర్స్ రీపిట్ కాకుండా చూసుకోవాలి. కొంతమంది 12345678, 222222,abcdefg, కీ బోర్డులో వరుసగా ఉన్న లెటర్స్, పేరు, తండ్రిపేరు, తల్లిపేరు, కొడుకు లేదా కూతురు పేరు, డేట్ ఆఫ్ బర్త్, డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు, పాస్‌పోర్టు నెంబరును పాస్‌వర్డ్‌గా పెడుతుంటారు. ఇలాంటివి ఇతరులు తేలికగా తెలుసుకొని మీ మెయిల్‌ను హ్యాకింగ్ చేయవచ్చు. ఇతరులు ఎవరూ మన మెయిల్‌ను, నెట్ ఆన్‌లైన్ బ్యాంకింగ్ అకౌంట్‌ను హ్యాక్ చేయకుండా ఉండాలంటే కనీసం ఎనిమిది క్యారెక్టర్లు లేదా అంతకంటే ఎక్కువ క్యారెక్టర్లతో కూడిన స్ట్రాంగ్ పాస్‌వర్డ్ ఉండాలి. మీ పాస్‌వర్డ్‌లో లెటర్స్, పంక్చువేషన్‌లు, సింబల్స్, నెంబర్లు ఇలా కీబోర్డులోని అన్ని రకాల కీలతో కూడిన వైవిధ్యంగా పాస్‌వర్డ్‌ను పెట్టుకోవటం మంచిది. స్పెషల్ క్యారెక్టర్లు అయిన అండ్, డాలర్, బ్రాకెట్ సింబల్స్, హాష్ ఇలా కలుపుకోవచ్చు. ఇంట్లో ఉన్న సిస్టం కావచ్చు లేదా ల్యాప్‌టాప్ కావచ్చు పాస్‌వర్డ్ పెట్టుకుంటే వైరస్ సులభంగా చేరదు. అన్నింటికి ఒకే పాస్‌వర్డ్ వాడవద్దు. సైబర్ నేరాల బారి నుంచి బయటపడాలంటే ఈమెయిల్, క్రెడిట్‌కార్డు, నెట్ బ్యాంకింగ్, సిస్టంలకు వేర్వేరుగా వైవిధ్యంతో కూడిన స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను పెట్టుకోవటం మేలు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top