పొట్టఉబ్బరం, తేన్పులు, ఎసిడిటీ, తిన్నది జీర్ణం కాకపోవడం వంటి లక్షణాలతో మనిషి జీవితంలో ఒక్కసారైనా బాధపడతారు. ఇవి ఉదర సంబంధ వ్యాధి లక్షణాలు. ఇవి కనిపిస్తే పిత్తాశయంలో రాళ్లు ఉన్నాయేమోనని అనుమానించాలి-నివారణ



ఆహారంలో ఎక్కువగా కొవ్వు పదార్థాలు తీసుకోకుండా ఉండడం, ఎక్కువగా నీరు తాగడం, పండ్లు, కూరగాయలు తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి జీవనశైలితో స్టోన్స్ తయారుకాకుండా నియంత్రించవచ్చు.

పొట్టఉబ్బరం, తేన్పులు, ఎసిడిటీ, తిన్నది జీర్ణం కాకపోవడం వంటి లక్షణాలతో మనిషి జీవితంలో ఒక్కసారైనా బాధపడతారు. ఇవి ఉదర సంబంధ వ్యాధి లక్షణాలు. ఇవి కనిపిస్తే పిత్తాశయంలో రాళ్లు ఉన్నాయేమోనని అనుమానించాలి. ఉదరభాగం... ముఖ్యంగా కుడివైపున నొప్పి, పొట్ట ఉబ్బరంగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తే అది పిత్తాశయంలో రాళ్ల వల్ల అని భావించవచ్చు. ఈ సమస్యను వైద్యపరిభాషలో కొలి లిథియాసిస్ అంటారు.

గాల్‌స్టోన్స్ అంటే...

పిత్తాశయం అనేది ఒక సంచి వంటి నిర్మాణం. ఇది కాలేయం కింది భాగంలో ఉంటుంది. ఇది ఆహారం జీర్ణం కావడానికి ఉపయోగపడే స్రావాలను నిల్వ ఉంచుతుంది. గాల్‌స్టోన్స్ అనేవి కొలెస్ట్రాల్, పిగ్మెంట్స్ వల్ల ఏర్పడిన ఘనపదార్థాలు. ఇవి సన్నని ఇసుకరేణువు మొదలుకొని చిన్న బంతి వరకు అనేక సైజ్‌లలో పెరగవచ్చు. గాల్‌స్టోన్స్‌కు చికిత్స తీసుకోకపోతే అవి తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు. కొన్నిసార్లు ప్రాణాంతకం కావచ్చు. ఈ సమస్యకు సరైన మందులు వాడటం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.  



గాల్‌స్టోన్స్‌లో రకాలు...
గాల్‌స్టోన్స్‌లో అనేక రకాలు ఉన్నాయి. కొలెస్ట్రాల్ స్టోన్స్ ఆకుపచ్చగాగాని, పసుపుపచ్చ రంగులోగాని ఉంటాయి. 70% మంది ఇటువంటి స్టోన్స్‌తో బాధపడుతుంటారు. పిగ్మెంట్ స్టోన్స్ అనేవి నలుపు రంగులో ఉంటాయి. ఇవి పైత్యరసం, క్యాల్షియం వల్ల తయారవుతాయి. కొన్నిరకాలైన రక్తహీనత వ్యాధులు, రక్త సంబంధ వ్యాధుల వల్ల కూడా స్టోన్స్ తయారుకావచ్చు. చాలా కొద్దిమందిలో మాత్రమే ఈ రెండు రకాల స్టోన్స్ తయారవుతాయి. ఉదరభాగంలోని లక్షణాలు, స్కానింగ్ ద్వారా గాల్‌స్టోన్స్‌ను గుర్తించవచ్చు.


లక్షణాలు...
చాలామందిలో గాల్‌స్టోన్స్‌కు ఎటువంటి లక్షణాలు బయటకు కన్పించవు. ఇలాంటివారికి చికిత్స అవసరం లేదు. అయితే వేరే కారణాలతో వైద్యపరీక్షలు జరిపినప్పుడు అవి అనుకోకుండా బయటపడటమే ఎక్కువ. కొంతమందిలో గాల్‌స్టోన్ వల్ల వికారంగా అనిపించడం, ఉదరం కుడి భాగంలో తీవ్రంగా నొప్పి అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. స్టోన్స్ పిత్తాశయం నుంచి జారి పేగులకు కలిసే మార్గంలో అడ్డుపడినప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. నొప్పి ఆకస్మికంగా మొదలై మూడు గంటల వరకు ఉండవచ్చు. దీనిని గాల్‌స్టోన్ కోలిక్ అంటారు. నొప్పితో పాటు జ్వరం, జీర్ణక్రియ సక్రమంగా లేకపోవడం, చర్మం, కళ్లు పచ్చగా మారడం జరగవచ్చు. ఇది పైత్యరసంలో ఉండే బైల్ పిగ్మెంట్స్ వల్ల సంభవిస్తుంది.
  

కారణాలు...
గాల్‌స్టోన్స్ అనేక రకాల కారణాల వల్ల రావచ్చు. డయాబెటిస్, అతిబరువు, తక్కువ క్యాలరీల ఆహారం, కొలెస్ట్రాల్- ట్రైగ్లిజరైడ్స్ రక్తంలో ఎక్కువగా ఉండడం. ప్రెగ్నెన్సీ, గర్భనిరోధక మాత్రలు, వయసు పైబడ్డ కొద్దిమందిలో వంశపారంపర్యంగా కూడా రావచ్చు. మగవారిలో కన్నా ఆడవారిలో స్టోన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. హార్మోన్ సంబంధిత మందులు, గర్భనిరోధక మందుల... వాడకం ఇందుకు కారణం కావచ్చు. ఊబకాయం ముఖ్యకారణంగా చెప్పవచ్చు. అదేవిధంగా త్వరగా బరువు తగ్గడానికి అవలంబించే పద్ధతులు కూడా స్టోన్ తయారీకి కారణం కావచ్చు.

నివారణ...

సరైన ఆహారం, బరువును అదుపులో ఉంచుకోవడం వంటి జాగ్రత్తలతో గాల్‌స్టోన్‌ను నివారించవచ్చు. ఆహారంలో ఎక్కువగా కొవ్వు పదార్థాలు తీసుకోకుండా ఉండడం, ఎక్కువగా నీరు తాగడం, పండ్లు, కూరగాయలు తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి జీవనశైలితో స్టోన్స్ తయారవకుండా నియంత్రించవచ్చు.


నిర్ధారణ...
గాల్‌స్టోన్ లక్షణాలు కనిపించినపుడు స్కాన్, ఎక్స్‌రే ద్వారా గాల్‌స్టోన్ ఉన్నదీ, లేనిదీ నిర్ధారణ చేయవచ్చు. ఈఆర్‌సీపీ వంటి అధునాతన పద్ధతి ద్వారా స్టోన్ కచ్చితంగా ఎక్కడ ఉన్నది తెలుసుకోవచ్చు. గాల్‌స్టోన్‌వల్ల ఇబ్బంది ఎక్కువగా ఉన్నపుడు వాటిని లితోట్రోప్సీ అనే సర్జికల్ పద్ధతి ద్వారా తీసివేయడం లేదా పిత్తాశయం పూర్తిగా తీసివేయడాన్ని కొలిసిస్టెక్టమీ అంటారు. 40% మందిలో సర్జరీ అయినప్పటికి తిరిగి స్టోన్స్ తయారయ్యే అవకాశం ఉంది. (వారిలో స్టోన్ తయారయ్యే స్వభావం ఉంటుంది). సర్జరీ వల్ల విరేచనాలు, అరుగుదల లేకపోవడం వంటి లక్షణాలు కనిపింవచ్చు.

దీనిని ‘పోస్ట్ కొలిసిస్టెక్టమీ సిండ్రోమ్’ అనవచ్చు. హోమియోపతి వైద్య విధానంలో రోగ కారణాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మందు ఇవ్వడం ద్వారా స్టోన్‌ని కరిగించడమే కాకుండా తిరిగి తయారయ్యే స్వభావాన్ని కూడా నివారించవచ్చు. హోమియో మందుల మనిషి మానసిక శారీరక స్వభావాలను పరిగణనలోనికి తీసుకొని ఇస్తారు. గాల్‌స్టోన్‌కు కామన్‌గా వాడే మందులు... కాల్కేరియా కార్బ్‌లైకోపోడియం చెలిడోనియం, బ్రయోనియా, నక్స్‌వామిక, మెగ్నీషియా ఫాస్, క్యాలికార్బ్  మొదలైనవి. సరైన మందులు సరైన పొటెన్సీలో, నిపుణులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వాడడం ద్వారా ‘గాల్‌స్టోన్స్’ను పూర్తిగా నిర్మూలించవచ్చు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top