కాలేజ్ విద్యార్దులు ఇంటర్‌నెట్ బ్రౌజింగ్ చేసేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ?

* మీ సిస్టంలో మాల్‌వేర్, వైరస్‌లతోపాటు ఆన్‌లైన్ ద్వారా వచ్చే ఇతర రకాల థ్రెట్స్‌ను తట్టుకొని రక్షణ ఇచ్చేలా లేటేస్ట్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్, వెబ్‌బ్రౌజర్, ఆపరేటింగ్ సిస్టంను ఇన్‌స్టాల్ చేసుకోండి.

* కొన్ని రకాల సాఫ్ట్‌వేర్ ప్రోగ్రాంలు వైరస్ తదితర సమస్యలు తలెత్తకుండా ఆటోమేట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకుంటాయి. మీ సిస్టంలో ఆటోమేటిక్ అప్‌డేట్స్ ఉండే ఆప్షన్లను ఎంచుకోండి.

* నెట్‌కు కనెక్టు అయ్యే ముందు మీ కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్, గేమింగ్ సిస్టం, వెబ్ అనేబుల్డ్ డివైజ్‌లన్నీ మాల్‌వేర్, వైరస్‌ల బారినుంచి రక్షణ ఉండేలా చూసుకోండి.

* యూఎస్‌బీ, ఇతర ఎక్స్‌టర్నల్ డివైజ్‌లు వైరస్‌తో ఇన్‌ఫెక్ట్ కాకుండా మీ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ను స్కాన్ అయ్యేలా చూసుకోండి.



మీ పర్సనల్ ఇన్‌ఫర్‌మేషన్‌ను సంరక్షించుకోండి
మీకున్న అకౌంట్ పాస్‌వర్డ్‌లను రక్షించుకోండి. మీ పాస్‌వర్డ్‌లో క్యాపిటల్, లోయర్‌కేస్ లెటర్స్, నెంబర్లు, సింబల్స్‌తో కూడిన పాస్‌వర్డ్‌ను ఏర్పాటు చేసుకోవటం ద్వారా రక్షణ పొందవచ్చు. మీ మెయిల్, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్‌లకు వేర్వేరుగా అకౌంట్‌లు, వేర్వేరు పాస్‌వర్డ్‌లు ఉండేలా చూసుకోవటం ద్వారా సైబర్‌క్రిమినల్స్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఎవరైనా మీరు ఏర్పరచుకున్న పాస్‌వర్డ్‌లను మర్చిపోవటం సహజం. అందుకే మీ కంప్యూటర్ పాస్‌వర్డ్స్‌ను కంప్యూటర్‌కు దూరంగా సురక్షిత ప్రదేశంలో రాసి ఉంచుకోండి. మీరు ఆన్‌లైన్ వ్యవహారాలు సాగిస్తున్నపుడు మీరు ప్రైవసీగా ఉండేలా చూసుకోండి. మీ ల్యాప్‌టాప్‌ను లేదా డివైజ్‌ను కొన్ని నిముషాల కోసమైనా ఎవరికీ ఇవ్వవద్దు.
కనెక్ట్ విత్ కేర్
మీరు బ్రౌజింగ్ చేసేటపుడు మీకు ఈమెయిల్ వచ్చిన లింక్ లేదా ట్విట్స్, ఆన్‌లైన్ అడ్వర్‌టైజ్‌మెంట్‌లను కూడా సైబర్ క్రిమినల్స్ వదలకుండా మీ కంప్యూటర్‌లోకి రావటానికి యత్నిస్తుంటారు. మీకు అనుమానమొస్తే వెంటనే అలాంటి ఈ మెయిల్స్‌ను వెంటనే డిలిట్ చేయండి. మీరు బ్యాంకింగ్ లావాదేవీలు, ఆన్‌లైన్ షాపింగ్ చేసేటపుడు మీరు బ్రౌజ్ చేసే వెబ్ అడ్రసులను నిజమైనవా కావా అనేది సరిచూసుకోవాలి.



మీరు నమ్మిన వెబ్‌సైట్‌ల గురించి తాజా సమాచారాన్ని మీ స్నేహితులు, కుటుంబసభ్యులు, తోటి విద్యార్థులతో చర్చించండి. మీ విలువైన సమాచారం, మ్యూజిక్, ఫొటోలు, ఇతర డిజిటల్ ఇన్‌ఫర్‌మేషన్‌ను కాపీ చేసుకొని సురక్షితంగా స్టోర్ చేసుకోండి. అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని నెట్‌ను బ్రౌజింగ్ చేయటం సురక్షితమని గుర్తించండి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top