మెడనొప్పితో తస్మాత్ జాగ్రత్త...

మెడనొప్పి అక్కడి నుంచి ఏ భుజానికో, చేతుల చివరలకో పాకుతుంటే కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే అది తీవ్రమైతే మరికొన్ని ఇతర సమస్యలకు దారితీయవచ్చు. మెడనొప్పి తీవ్రత వల్ల మూత్రాశయంలో కూడా మార్పులు రావచ్చు. దీనికి కారణం నొప్పి ఎక్కువైన కొద్దీ నరాల మీద ఒత్తిడి పెరిగడం వల్ల మూత్రవిసర్జనలో తేడాలు వచ్చి అది ఇతర సమస్యలకు దారితీయవచ్చు. 

ఎందుకీ మెడనొప్పి... మెడ దగ్గర ఉండే వెన్నెముకలో ఏడు వెన్నుపూసలు ఉంటాయి. వాటిలో మొదటి వెన్నుపూసను అట్లాస్ అంటారు. రెండోదాన్ని ఆక్సిస్ అంటారు. ఆ తర్వాత ఉండే పూసలను సి3, సి4, సి5, సి6, సి7 అని పిలుస్తారు. ఇవన్నీ ఒకదానితో మరొకటి అనుసంధానం అయి ఉంటాయి. వీటి మధ్య ఉండే ప్రదేశాన్ని స్పైనల్ కెనాల్ అంటారు. దాని ద్వారా స్పైనల్ కార్డ్ (వెన్నుపాము) మెదడు నుంచి చేతులు, కాళ్ల చివరి వరకు నరాలను తీసుకెళ్తుంది. ఒక వెన్నుపూసకూ, మరోదానికి ఉన్న ఖాళీ అయిన వర్టిబ్రల్ పారామినా ద్వారా వెన్నుపాము నుంచి నరాలు బయటకు వచ్చి అన్ని అవయవాలకూ వ్యాపించి ఉంటాయి. వెన్నుపూసల మధ్యన ఉండే డిస్క్ ఒక కుషన్‌లా, షాక్ అబ్జార్బర్‌లా పనిచేస్తుంటాయి. ఒక్కోసారి వెన్నుపూసల మధ్య కుషన్‌లా ఉండే డిస్క్‌లు కూడా పక్కకు జారతాయి. దాంతో నరాలపై (ప్రధానంగా చేతులకి సప్లై అయ్యే నరాలపై) ఒత్తిడి పడి మెడనొప్పి భుజానికి పాకుతుంది.

చిన్న మెదడుకు రక్తప్రసరణ ఆగవచ్చు...

వెన్నుపూస నుంచి మెదడులోకి వెళ్లే రెండు రక్తనాళాలైన వర్టిబ్రల్ ఆర్టరీస్ (వర్టిబ్రల్ ధమనుల) వల్ల చిన్నమెదడుకు రక్తం సరఫరా అవుతుంటుంది. నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఈ ధమనుల నుంచి చిన్నమెదడుకు రక్తప్రసరణ సరిగా జరగదు. దాంతో నొప్పితో పాటు తల తిరగడం, తల దిమ్ముగా ఉన్నట్లు  అనిపించడం, ఒక్కోసారి వాంతులు కావడం వంటి సమస్యలు రావచ్చు.

మెడ నొప్పి నుంచి ఉపశమనం కోసం...
మెడ నొప్పి వచ్చినప్పుడు వేడి నీళ్లలో మెత్తటి గుడ్డను ముంచి, పిండి మెడపైన కాపడం పెట్టాలి. ఐస్ ముక్కను ఒక బట్టలో చుట్టి దానితో కాపడం పెట్టడం కూడా మంచిదే. ఈ కాపడాల వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది మెడ కండరాల్లో నొప్పి ఉన్నప్పుడు తప్పనిసరిగా మెడకు విశ్రాంతి ఇవ్వాలి. ఎందుకంటే ఆ సమయంలో మెడ కండరాలు బిగుసుకుపోయి ఉంటాయి. అలా విశ్రాంతి ఇవ్వకపోతే నొప్పి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది నొప్పి ఉన్న సమయంలోనే గాక... మామూలు వేళల్లోనూ ఒకే భుజానికి బరువైన బ్యాగ్‌ల వంటివి తగిలించుకోకూడదు. ఇలా చేయడం వల్ల మెడ కండరాలు, నరాలపై ఒత్తిడి పెరిగి నొప్పి వస్తుంది నడిచే సమయంలో ఒకేవైపునకు ఒంగడం సరికాదు. 

చికిత్స: సాధారణ మెడనొప్పి అయితే పెయిన్‌కిల్లర్ ఆయింట్‌మెంట్లను రోజుకి ఐదు నుంచి ఆరుసార్లు పూయాలి నొప్పి నివారణ కోసం దీర్ఘకాలం పెయిన్‌కిల్లర్స్ ఉపయోగించడం సరికాదు. ఒకవేళ పెయిన్‌కిల్లర్స్‌తో ఒకటి రెండు రోజుల్లో రిలీఫ్ రాకపోతే తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి డిస్క్ తన స్థానం నుంచి పక్కకు జరగడం లాంటివి గమనిస్తే దానికి తగిన చికిత్స చేయాల్సి ఉంటుంది. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top