మీరు టూ వీలర్ నడుపుతున్నారా? అయితే ఇది చదవండి

మీరు టూ వీలర్ నడుపుతున్నారా? తరచూ విపరీతమైన పొగను వెలువరించే వాహనం వెనక వెళ్తున్నారా? ఒక పక్క ఆలస్యం అవుతోందనే దిగులు! మరో పక్క దాన్ని ఓవర్‌టేక్ చేయలేని నిస్సహాయత!! ఈ రెండింటి మధ్య సతమతం అవుతున్నారా? ఏమాత్రం ఆలోచించకుండా కాసేపు మీ ప్రయాణాన్ని స్లో చేసుకోండి. పొగ వెలువరించే వాహనం పరిధి నుంచి బయటకు వచ్చాకే మీరు వాహనం నడపండి. ఎందుకంటే పొగతో వచ్చే దుష్ర్పభావాలు చాలా ఉన్నాయి... అవి.

విపరీతమైన కోపం, నిస్పృహ కల్పించడం


రాత్రివేళ నిద్రపట్టకపోవడం


త్వరగా సహనం కోల్పోవడం 


కడుపునొప్పి తలనొప్పి
 

పవర్తనలో మార్పులు రావడం రక్తపోటు పెరగడం రక్తహీనత

అజీర్ణం కళ్లు సమస్యలు ఊపిరితిత్తుల సమస్యలు


పొగలు వెలువరించే వాహనాల వెనక ప్రయాణం చేసేవారికి పైన పేర్కొన్న ఆరోగ్య సమస్యలు వస్తాయి. దాంతోపాటు కొందరిలో పొగ వల్ల మూత్రపిండాలు కూడా దెబ్బతినవచ్చు. ఆస్తమా వంటి సమస్య ఉన్నవారిలో అది ఒక ట్రిగరింగ్ ఫ్యాక్టర్‌లా పనిచేస్తుంది. మహిళలు ఎక్కువగా పొగకు ఎక్స్‌పోజ్ అయితే గర్భస్రావం అయ్యే ప్రమాదం కూడా ఉంది. పైగా కొన్ని వాహనాలను కిరోసిన్‌తో నడుపుతుంటారు. తెల్లని పొగ వెలువరించే ఆ కాలుష్యం క్యాన్సర్ కారకం (కార్సినోజిన్)కూడా కావచ్చు. అందుకే పొగ నుంచి దూరంగా ఉండండి. ఆరోగ్యంగా ఉండండి. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top