పిల్లలు ఏయే సమయాల్లో నడుస్తారు, మాట్లాడతారు... వాళ్లలో కలిగే వికాసాన్ని గ్రహించడం ఎలా అన్న అంశాలను తెలుసుకోండి.

పిల్లలు నడవడం, మాట్లాడటం అనేది వాళ్ల వికాసానికి సంకేతం. వాళ్లు ఈ పనులు సరిగా చేయలేకపోతే వాళ్లలో శారీరకంగా, మానసికంగా వికాసం లేదని గ్రహించాలి. అయితే కొందరిలో ఈ నడక, మాట్లాడటం ఆలస్యం కావచ్చు. పిల్లలు ఏయే సమయాల్లో నడుస్తారు, మాట్లాడతారు... వాళ్లలో కలిగే వికాసాన్ని గ్రహించడం ఎలా అన్న అంశాలను తెలుసుకోండి.

నడక: 

సాధారణంగా పిల్లలు 11 నుంచి 16 నెలల మధ్య నడవడం ప్రారంభిస్తారు. కొందరు ఆలస్యంగా నడవడం మొదలుపెట్టవచ్చు. 18 నెలల పిల్లలు నడవడంతో పాటు ఏదైనా వస్తువులు పట్టుకుని లాగడం, వస్తువులను దూరంగా నెట్టడం, బుక్ చేతికి ఇచ్చినప్పుడు పేజీలు తిప్పడం, క్రేయాన్స్ వంటివి ఇస్తే వాటితో నేలమీద, గోడలపై రాయడం, నేల మీదే దృష్టిపెట్టి పరుగెత్తడం వంటివి సులభంగా చేస్తుంటారు. రెండేళ్లు వచ్చే సరికి తలుపులు తెరవడం, సొరుగులు లాగడం, చేతులు కడుక్కోవడం, మెట్లు ఎక్కడం లాంటివి చేస్తుంటారు. ఈ పనులు చేయడంలోనూ పిల్లవాడికీ, పిల్లవాడికీ తేడాలుంటాయి.
 

మాటలు:
 ఇక మాటల విషయానికి వస్తే 15 నెలలు నిండిన చిన్నారులు రకరకాల శబ్దాలతో పాటు ముద్దుమాటలు (బాబ్లింగ్స్), ఒకటి రెండు నిజశబ్దాలు పలకడం చేస్తుంటారు. 18 నుంచి 24 నెలల వయసుకు వాళ్లు 15-20 పదాలు పలకడంతో పాటు తల్లిదండ్రుల సూచనలకు రెస్పాండ్ అవుతుంటారు. 

18-20 నెలల వయసు వచ్చేటప్పటికి కొద్దిగా కూడా మాటలు రాకపోతే, చుట్టుపక్కల శబ్దాలకు ఏమాత్రం రెస్పాండ్ కాకపోతే, పైన పేర్కొన్న విధంగా స్పందించకపోకపోతే అప్పుడు అలాంటి పిల్లలకు గ్రాస్ డెవలప్‌మెంట్ డిలే ఉన్నట్లుగా పరిగణించాలి. ఇలా డెవలప్‌మెంట్ డిలే ఉన్నట్లు అనుమానించే పిల్లల విషయంలో క్రమం తప్పకుండా ఫాలో అప్స్‌తో పాటు క్లోజ్ అబ్జర్వేషన్ చాలా ముఖ్యం. ఒకవేళ నిజంగానే గ్రాస్ డెవలప్‌మెంట్ డిలే ఉంటే త్వరగా కనుక్కుని అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవడం (ఎర్లీ ఇంటర్‌వెన్షన్ ప్రోగ్రామ్స్) ద్వారా వాళ్లను సరిచేయడానికి అవకాశం ఉంది.

కారణాలు:

 నెలలు నిండకముందే పుట్టడం, గర్భంలో ఉన్నప్పుడు ఏవైనా సమస్యలు రావడం, గర్భవతిగా ఉన్నప్పుడు తల్లికి ఏవైనా సమస్యలు రావడం, పుట్టాక జాండీస్, ఇన్ఫెక్షన్స్ వంటివి రావడం, కొన్ని జన్యుపరమైన కారణాలు, పిలల్లను పెంచే ప్రక్రియలో తల్లిదండ్రులు అతిగా సంరక్షించడం (ఓవర్ ప్రొటెక్టివ్‌గా ఉండటం), కవల పిల్లలు కావడం వంటి అనేక కారణాలు వాళ్ల డెవలప్‌మెంట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. పిల్లల్లో తగిన వికాసం లేదని అనుమానిస్తే మీ పిడియాట్రిషన్‌ను సంప్రదించాలి.
 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top