ప్రసిద్ధ పర్యాటక క్షేత్రం అరకులోయ విశేషాలు తెలపండి?

మనరాష్ట్రంలో ఉన్న వేసవి విడిది ప్రాంతాల్లో అరకులోయ ఒకటి. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాల నడుమ అలరారుతున్న ఈ సుందర ప్రదేశం అనంతగిరి కొండలలో ఉంది. విశాఖపట్టణం నుంచి రైలు, బస్సు మార్గాలు ఉన్నాయి. అరకులోయ లేదా అరకువేలీ అనే ఈ క్షేత్రానికి రైలులో వెళితే ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. దాదాపు 32 సొరంగాల గుండా కొండలు, జలపాతాల మధ్య ప్రయాణం ఆహ్లాదకరంగా, రమణీయంగా సాగుతుంది. అరకులోయలో పర్యాటకులకు ఆకట్టుకునేవి ఇక్కడి జలపాతాలే. ఇవి నిరంతరం ప్రవహిస్తుంటాయి. చూపరులను ఆకట్టుకునే అద్భుత దృశ్యాలు ఈ అరకులోయ సొంతం. ఇక్కడ ఎక్కువగా గిరిజనులు నివసిస్తారు. మోరి, తుడుమ్, డప్పు వంటి పరికరాలతో గిరిజనులు చేసే నృత్యాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అరకులోయలో బస చేయడానికి గెస్ట్ హౌస్‌లు, రిసార్ట్స్ అందుబాటులో ఉన్నాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top