శారీరక,మానసిక సమస్యల నుంచి తేలిగా బయటపడటానికి వాయు ముద్ర


ఆసనాలతో పోలిస్తే..తేలికగా ఉండే ముద్రలతో శారీరక,మానసిక సమస్యల నుంచి తేలిగా బయటపడవచ్చు. రోజులో నిర్ణీత సమయాన్ని ఈ ముద్రలకు కేటాయించడం వల్ల చక్కని ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని అంటున్నారు యోగా నిపుణలు. 

సాధన చేసే విధానం..  
ఈ ముద్రని కీళ్ల నోప్పులు,పక్షవాతం, రుమాటిజం, చేతులు కాళ్లు , తల వణికే వారు ధరిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. సుఖాసనంలో కూర్చుని..చూపుడు వేలు చివర బొటనవేలు తగిలేట్టుగా ఈ ముద్రని ధరించాలి. తక్కిన మూడు వేళ్లను కాస్త వదులుగా, నిటారుగా ఉంచాలి. బొటనవేలితో చూపుడు వేలుకు కొంచెం ఒత్తిడి కలిగించాలి. రోజుకు పావుగంట పాటు ఈ ముధ్రవేయాలి. ఆయుర్వేదం ప్రకారం సుమారు 51 వాయువులు దేహంలో ఉంటాయి. వాటిలో అసమతుల్యం ఏర్పడినప్పుడు ఆనారోగ్యాలు వస్తాయి. ఇది చేయడం వల్ల పైన పేర్కోన్న సమస్యలకి ఉపశమనం కలుగుతుంది. దీర్ఘకాలిక వ్యాధులకైతే మరికొంత కాలం పడుతుంది. ఆరోగ్యం చేకూరిన తర్వాత ఈ ముద్ర వేయాల్సిన అవసరం ఉండదు. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top