అరటిపండు తినడం కోసమే కాకుండా చర్మసౌందర్య సాధనంగా కూడా ఎలా వాడచ్చో తెలుసుకుందామా...

రోజూ ఒక అరటిపండు తినడం వల్ల శరీరానికి శక్తి వస్తుందని అందరికీ తెలుసు. దీన్ని కేవలం తినడం కోసమే కాకుండా చర్మసౌందర్య సాధనంగా కూడా వాడుకుంటే బోలెడు ఫలితాలుంటాయి.

- పచ్చిపాలలో అరటిపండు గుజ్జు కలిపి మొహానికి ప్యాక్ వేసుకుని పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కుంటే చర్మం మృదువుగా ఉంటుంది.

- రెండు అరటిపండ్లు, కొంచెం కీరా ముక్క, పుల్లటి పెరుగు మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకుని తలకి పట్టించుకుంటే తలలోని చుండ్రుపోయి కురులు మెత్తగా, ఆరోగ్యంగా ఉంటాయి.

- అరటిపండు గుజ్జు, కర్బూజ పండు గుజ్జు, శెనగపిండి సమపాళ్లలో తీసుకుని బాగా కలిపి మోచేతులకు, మోకాళ్లకు పట్టించి పదినిమిషాల తర్వాత స్క్రబ్ చేస్తే దళసరి చర్మం మెత్తగా మారుతుంది. ఇలా వారంలో మూడుసార్లు చేస్తే త్వరగా ఫలితం కనిపిస్తుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top