అందాల సుందరధామం కొడెకైనాల్ ఎక్కడ ఉంది? దాని విశేషాలు ఏమిటి?


భూతల స్వర్గంగా పేరు గాంచిన కొడెకైనాల్ తమిళనాడు రాష్ట్రంలో ఉంది. పళని క్షేత్రానికి 65 కిమీల దూరంలో ఉంది. ఈ ప్రదేశాన్ని ప్రిన్స్ ఆఫ్ హిల్ స్టేషన్‌గా వ్యవహరిస్తారు. కొడెకైనాల్ సముద్రమట్టానికి 2,133 అడుగుల ఎత్తులో ఉంది. సంవత్సరం పొడవునా దేశవిదేశ పర్యాటకులతో రద్దీగా ఉండే కొడెకైనాల్‌లో అడుగు అడుగునా సుందరదృశ్యాలు దర్శనమిస్తాయి. కొడైలేక్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. పచ్చని చెట్లు, పొలాల మధ్య 60 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ సరస్సులో బోటింగ్ సౌకర్యం ఉంది. ఇక్కడ ఉన్న సుందర ప్రాంతాలలో ‘కోకర్స్‌వాక్, అప్పర్ లేక్ వ్యూ, గ్రీన్ వ్యాలీ వ్యూ, గోల్ఫ్’ క్లబ్ ముఖ్యమైనవి. వేసవిలో కొడెకైనాల్ పర్యటన అద్భుతమైన అనుభూతి. ఇక్కడ బస చేయడానికి హోటళ్లు, రిసార్టులు ఉన్నాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top