మధుమేహం, అధిక రక్తపోటు... ఈ రెండింటికి ఒకదానితో ఒకటి సంబంధం ఉంది. దాని గురించి తెలుసుకుందామా....

మధుమేహం, అధిక రక్తపోటు... ఈ రెండింటికి ఒకదానితో ఒకటి సంబంధం ఉంది. అధిక రక్తపోటు ఉన్నవారు మధుమేహం బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మధుమేహం ఉన్నవారిలో అధిక రక్తపోటు ఉంటుంది. రక్తంలో చక్కెర శాతం పెరిగిపోవడం లేదా శరీరం తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోవడం వల్ల డయాబెటిస్ సమస్య ఉత్పన్నమవుతుంది. ఇక రక్తపోటు140/90 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే అధిక రక్తపోటు ఉన్నట్లుగా భావించాలి. హృదయ స్పందనలు జరిగినపుడు రక్తం ధమనుల్లోకి పంప్ చేయబడుతుంది. గుండె వ్యాకోచం చెందినపుడు రక్తపోటు ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో రక్తం పంప్ చేయబడుతుంది. దీన్ని సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు. గుండె సంకోచం చెందినపుడు రక్తపోటు పడిపోతుంది. దీన్ని డయాస్టోలిక్ ప్రెషర్ అంటారు.
ఏమిటా సంబంధం?
కొందరిలో డయాబెటిస్,హైబిపిలు ఒకేసారి బయటపడే అవకాశం ఉంది లేదా ఒక సమస్య ఉందని తేలితే మరొకటి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డయాబెటిస్ వల్ల శరీరంలో ఫ్లూయిడ్ శాతం పెరుగుతుంది. ఇది అధిక రక్తపోటు పెరగడానికి కారణమవుతుంది. డయాబెటిస్ వల్ల రక్తనాళాల్లో సాగే గుణం తగ్గిపోతుంది. దీనివల్ల రక్తపోటు పెరిగిపోతుంది. స్థూలకాయం వల్ల ఈ రెండూ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

టైప్ 1 డయాబెటిస్ :

 ఇది అటోఇమ్యూన్ డిసీజ్. బెటా సెల్స్ నాశనమవడం మూలంగా ఈ సమస్య ఏర్పడుతుంది. జన్యుపరమైన కారణాలు, పోషకాహార లోపం(మాల్‌న్యూట్రిషన్), పాంక్రియాస్‌పై వైరస్ ప్రభావం వల్ల ఈ రకమైన డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. టైప్ 2 డయాబెటిస్ : దీన్ని నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మెల్లిటస్ అని కూడా అంటారు. శరీరంలో సరిపడా ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. కానీ శరీరం ఆ ఇన్సులిన్‌ను ఉపయోగించుకోలేదు.ఈ రకమైన డయాబెటిస్ ఎక్కువగా మధ్యవయస్కుల్లో కనిపిస్తుంది.
కారణాలు
కొన్ని రకాల జన్యువులు వారసత్వంగా తమ సంతానానికి సంక్రమిస్తుంటాయి. అలాగే డయాబెటిస్ వారసత్వంగా వచ్చే అవకాశాలున్నాయి. అధిక బరువు వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఒకే చోట కూర్చుని పనిచేసే వారు డయాబెటిస్ బారినపడే అవకాశాలు ఎక్కువ. వారంలో మూడు రోజులు వ్యాయామం చేసేవారిలో ఈ రిస్క్ కాస్త తక్కువ. దీర్ఘకాలం పాటు మానసిక ఆందోళనతో బాధపడేవారు, ఒత్తిడికిలోనయ్యే వారిలో డయాబెటిస్ రిస్క్ ఎక్కువ. పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ సమస్యతో బాధపడుతున్న స్త్రీలలోనూ ఈ సమస్య కనిపిస్తుంది. ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోవడానికి అవకాశం ఉంది.
అవయవాలపై ప్రభావం
రక్తనాళాలు-గుండె :

 డయాబెటిస్, అధిక రక్తపోటు సమస్యలు అథెరోజెనెసిస్‌కు కారణమవుతాయి. మెటబాలిక్ అబ్‌నార్మాలిటీస్ వల్ల అథెరోస్కెలెరోసిస్‌కు దారితీస్తుంది. రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడటం, గుండె జబ్బులు రావడం జరుగుతుంది.

కిడ్నీ : 

ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్(ఈఎస్ఆర్‌డీ)కు డయాబెటిస్ మెల్లిటస్, హైపర్‌టెన్షన్ సాధారణ కారణాలుగా ఉంటాయి. డయాబెటిస్ మెల్లిటస్ బారిపడిన వారిలో కిడ్నీ సమస్య మొదలవుతుంది.

పెరిఫెరల్ న్యూరోపతి:

 మధుమేహం దీర్ఘకాలం పాటు కొనసాగినపుడు రక్తనాళాలు దెబ్బతింటాయి. పాదాలు, చేతులు, కాళ్లు, వేళ్లలో నొప్పులు వంటి లక్షణాలుంటాయి. 
డయాబెటిక్ ఫుట్ :
 డయాబెటిస్ మూలంగా ఇన్‌ఫెక్షన్లపై పోరాడే శక్తి తగ్గిపోతుంది. చిన్న గాయమైనా మానడానికి చాలా కాలం పడుతుంది.
హోమియో చికిత్స
రోగి శారీరక , మానసిక లక్ష ణాలు, వ్యాధి తీవ్రతను పరిశీలించి చికిత్స అందించడం జరుగుతుంది. హోమియోపతి మందులు తీసుకోవడంతో పాటు యాంటీబయోటిక్ మందులు, ఇన్సులిన్ తీసుకోవడం ద్వారా డయాబెటిస్‌ను నియంత్రించడం జరుగుతుంది. హైపోగ్లైసెమిక్ డ్రగ్స్‌ను అవసరమైన డోస్ ఇవ్వడం ద్వారా వ్యాధి తీవ్రత పెరగకుండా నివారించవచ్చు. హోమియోపతి చికిత్స డిఫెన్స్ మెకానిజంను పెరిగేలా చేస్తుంది.

దీనివల్ల రోగి త్వరగా కోలుకుంటాడు. లైకోపోడియం, ఫాస్పరస్, ట్యుబర్ కులినిమ్, ప్లంబమ్ మెటల్లికమ్, టారెంటులా, సిలికా, నాట్రమ్ ఫాస్పరస్ వంటి మందులు ఈ సమస్యల నివారణకు చక్కగా ఉపయోగపడతాయి. డయాబెటిస్, అధిక రక్తపోటు ఉన్నట్లు తేలిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా హోమియో వైద్యుని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం ద్వారా ఇతర సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.
 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top