పళ్లరసాలను తీసుకోవడం కన్నా నేరుగా పళ్లను తినడం మంచిది ఎలా అంటే.....

‘మమ్మీ, జ్యూస్’ అని పిల్లలు అడగ్గానే సంతోషంగా ఫ్రూట్ జ్యూస్ ఇచ్చే పేరెంట్స్ ఇక నుంచి ఒక్కక్షణం ఆలోచించమని సలహా ఇస్తున్నారు దంతవైద్యులు. ఎందుకంటే పళ్లరసాలు, శీతలపానీయాలు, స్మూతీల కారణంగా పిల్లల దంతాలపై ఎనామిల్ దెబ్బతిని, దంతక్షయం సమస్యలు పెరుగుతున్నాయని రాయల్ కాలేజీకి చెందిన డెంటల్ సర్జన్ కాథే హార్లీ చెబుతున్నారు. పళ్లను తినడం వల్ల వచ్చే పోషకాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పళ్లరసాలను సేవించడం వల్ల అందులోని ఆమ్లాలు దంతక్షయానికి గురిచేస్తాయి అంటున్నారు ఆమె.

అందుకే హార్లీ తల్లిదండ్రులకు కొన్ని సూచనలు చేస్తున్నారు. పిల్లలు జ్యూసులను అంతగా కావాలని కోరుకుంటే వారానికి ఒకసారి మాత్రమే ఇవ్వమని సూచిస్తున్నారు. పళ్లరసాలను తీసుకోవడం కన్నా నేరుగా పళ్లను తినడం వల్ల తగు మోతాదులో ఫైబర్ ఒంట్లోకి చేరుతుంది, ఆమ్లాల శాతం తక్కువగా ఉంటుంది, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పళ్ల రసాల తయారీలో పిప్పిని పడేస్తుంటారు కాబట్టి పోషకాలు ఏ మాత్రం అందవని లండన్ డెంటల్ ఇన్‌స్టిట్యూట్ నిపుణులు సైతం హార్లీ సూచనతో ఏకీభవిస్తున్నారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top