ఏ అనారోగ్యం వచ్చినా కడుపులోకి నాలుగు మాత్రలు వేసుకోవడం నేడు చాలా మందికి బాగా అలవాటయిపోయింది. కానీ, వాటిలో చాలా వ్యాధులు మందులేవీ లేకుండా కేవలం మర్ధన చికిత్స (మసాజ్) ద్వారానే నయమైపోయే అవకాశాలు ఉన్నాయి.

ఏ అనారోగ్యం వచ్చినా కడుపులోకి నాలుగు మాత్రలు వేసుకోవడం నేడు చాలా మందికి బాగా అలవాటయిపోయింది. కానీ, వాటిలో చాలా వ్యాధులు మందులేవీ లేకుండా కేవలం మర్ధన చికిత్స (మసాజ్) ద్వారానే నయమైపోయే అవకాశాలు ఉన్నాయి. వ్యాధినుంచి విముక్తి పొందడమే కాదు కొత్త మానసికోత్తేజంతో జీవించే శక్తి కూడా ఈ మర్ధనతో లభిస్తుందని అంటున్నారు నిపుణులు.

మర్ధన చికి త్స లేదా మసాజ్ అనగానే అదేదో కేవలం భౌతికంగా, కేవలం కండరాల మీద ఒత్తిడి కలిగించే ఒక విధానం అన్న భావనే చాలా మందిలో ఉంది. అయితే మర్ధన చికిత్సలో అదొక భాగం మాత్రమే. నిజానికి కండరాల వ్యవస్థను నియంత్రించే నాడీ వ్యవస్థ మీద కూడా మర్ధన చికిత్స పనిచేస్తుంది. అసలు పలకరింపుగా మనం చేసే కరచాలనంలో జరుగుతున్నదేమిటి? ఎదుటి వారి మెదడు ద్వారాలను తెరవగలుగుతాం. 



అందుకే కరచాలనం ద్వారా మనకు అంతటి ఆహ్లాదం కలుగుతుంది. పైకి సాధారణ స్పర్శలా కనిపించే ఈ చర్యకు ఇంతటి లోతైన పునాదులు ఉన్నాయి. మర్ధన చికిత్సకు మనిషి స్పర్శ జ్ఞానాన్ని ఒక ఉచ్ఛస్థానానికి తీసుకువెళ్లే లక్ష్యం ఉంటుంది. అంతకన్నా మెదడు మీద అంటే నాడీ వ్యవస్థ మీద పనిచేయడమే మర్ధన చికి త్స ప్రధాన లక్ష్యం.
నాడీ వ్యవస్థే కీలకం
వాస్తవానికి మన శరీర వ్యవస్థ మొత్తాన్ని నియంత్రించేది మన నాడీ వ్యవస్థ. ఈ వ్యవస్థలో సింపాథిటి క్, పేరాసింపాథిటిక్ అనే రెండు విభాగాలు ఉంటాయి. శరీరంలోని కండరాలు, రక్తనాళాలు సంకోచించే వ్యవస్థను నియంత్రించేది సింపాథిటిక్ ప్రక్రియ. సంకోచం తరువాత ఆ కండరాలు, రక్తనాళాలు తిరిగి విచ్చుకునే వ్యవస్థను నియంత్రించేది పేరాసింపాథిటిక్ ప్రక్రియ. శరీరంలోని ఏ విభాగం అయినా సక్రమంగా పనిచే యాలంటే ఈ రెండు వ్యవస్థలూ సమాంతరంగా పనిచేస్తూ ఉండాలి.

సింపాథిటిక్ వ్యవస్థ అతిగా పనిచేసినా, పేరాసింపాథిటిక్ వ్యవస్థ అతిగా పనిచేసినా సమస్యలు మొదలవుతాయి. అందుకే ఈ రెండూ ఒక సంపూర్ణ సమన్వయంతో పనిచేస్తూ ఉండాలి. అప్పుడే శరీరంలోని అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేస్తాయి. ఇంత కీలకమైన ఈ అటానమస్ నాడీ వ్యవస్థ మీద మర్ధన చికిత్స సమర్ధవంతంగా పనిచేస్తుంది. మర్ధన చికిత్స అనేది కేవలం శారీరకమైన సౌఖ్యాన్ని మాత్రమే ఇచ్చేది కాదు. ఈ చికిత్సలో మెదడులోంచి ఎండార్ఫిన్స్ అనే రసాయనాలు విడుదల అవుతాయి. ఇవి విడుదల కావడం వల్ల మనసు ఎంతో ఉల్లాసాన్నీ, ఉత్తేజాన్నీ పొందుతుంది.


పసిపిల్లలకు ఎంతో అవసరం
ఇటీవలి కాలంలో పిల్లల్లో ఎదుగుదల సరిగా ఉండడంలేదని, దీనికి పిల్లలకు సరియైన నిద్ర లేకపోవడమే కారణమని పరిశోధనల్లో తేలింది. వాస్తవానికి పిల్లలు ఎదగడానికి దోహదం చేసే గ్రోత్ ఫ్యాక్టర్స్ గాఢనిద్రలోనే పరిపూర్ణంగా విడుదల అవుతాయి. గాఢత లేని నిద్రలో వాటి విడుదల బాగా తగ్గిపోతుంది. దీనివల్ల శారీరక ఎదుగుదల కుంటుపడటంతో పాటు కొన్ని మానసిక సమస్యలు కూడా ఇటీవల బాగా పెరిగిపోతున్నాయి. వీటిలో అతి చురుకు తనంతో పాటు ఏకాగ్రత లోపించే ఎడిహెచ్‌డి (అటెన్షన్ డె ఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్) సమస్య కూడా చాలా మంది పిల్లల్లో కనిపిస్తోంది.

అలాగే ఆటిజమ్ జబ్బు కూడా పిల్లల్లో ఎక్కువగానే కనిపిస్తోంది. ఇది కూడా నాడీ వ్యవస్థకు సంబంధించినదే. కొంత మంది పిల్లల్లో సకాలంలో మాటలు రాకపోవడం, నడ క రాకపోవడం వంటి సమస్యలు కూడా బాగా పెరిగాయి. ఈ సమస్యలకు ఇతర కారణాలు కూడా ఉన్నా, పిల్లల్లో గాఢ నిద్ర లేకపోవడం ఒక ప్రధాన కారణమని పరిశోధనల్లో తేలింది. ఈ సమస్యల్లో చాలా వరకు మర్ధనం బాగా ఉపకరిస్తుందని కూడా రుజువయ్యింది. అలాగే మునుముందు వారికి నాడీ సంబంధితమైన సమస్యలేవీ రాకుండా కూడా కాపాడుతుంది.
 

సైకో-న్యూరో- ఇమ్యునాలజీ
నిరంతరం మానసిక ఒత్తిళ్లకు గురయ్యే వారి వ్యాధి నిరోధక శక్తికీ, ఆ ఒత్తిళ్లు లేని వారి వ్యాధినిరోధక శక్తికీ ఎంతో తేడా ఉంటుంది. వాస్తవానికి మానసిక ఒత్తిళ్లకు గురయ్యే వారే ఎక్కువగా జబ్బులకు గురవుతారని ఎన్నో పరిశో«ధనల్లో రుజువయ్యింది. మర్ధన చికిత్స మానసిక ఒత్తిళ్లను త గ్గించడం ద్వారా వారి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. మర్ధనలో ఎండార్ఫిన్ రసాయనాల ఉత్పత్తి పెరగడమే ఇందుకు కారణం. ఈ క్రమంలో వారిలో ఉత్సాహం, ఉల్లాసం పెరుగుతాయి.
పక్షవాతానికి....
కేవలం మర్ధన ద్వారానే నయమైపోయే వ్యాధుల్లో పక్షవాతం ఒకటి. పక్షవాతంలో ప్రధానంగా నరాలు నిర్జీవంగా మారిపోతాయి. ఫలితంగా రక్తప్రసరణ అందక కండరాలు కూడా బలహీనపడతాయి. ఒకసారి నరాలు దెబ్బతింటే వాటిని తిరిగి పూర్వ స్థితికి తేవడం కష్టమని ఆధునిక వైద్యం చెబుతుంది. అయితే మర్ధనం ద్వారా ముందు కండరాలు శక్తి పుంజుకుంటాయి. ఈ ప్రభావం మెదడు మీద కూడా పడి, ఆ తరువాత క్రమంగా నరాలు సహజ శక్తిని పుంజుకోవడం ఎన్నో సార్లు రుజవయ్యింది.
 

వెన్నునొప్పి, కీళ్ల నొప్పులకు
శరీరం బరువులో సగాన్ని ఎముకలు మోస్తే, మిగతా సగం బరువును కండరాలు మోస్తాయి. కండరాలు బాగా బలహీనపడినప్పుడు అవి తమ వంతు బరువును మోయలేకపోతాయి. ఈ దశలో మొత్తం బరువు ఎముకలు, కీళ్ల మీదే పడుతుంది. ఎముకలు అరిగిపోవడానికి, దెబ్బతినడానికి దారి తీస్తాయి. ఫలితంగా, మెడ, వెన్ను, నడుము నొప్పికి కారణమయ్యే స్పాండిలోసిస్ సమస్యలు, మోకాళ్ల నొప్పులు, అన్ని రకాల కీళ్లనొప్పులు మొదలవుతాయి. వీటన్నిటికీ కండరాలను తిరిగి బలోపేతం చేయడమే పరిష్కారం. అది మర్ధనతో సాధ్యమవుతుంది.
యాంగ్జయిటీ న్యూరోసిస్
రోజురోజుకూ పెరుగుతున్న జీవితపు ఒత్తిళ్ల కారణంగా చాలా మంది నేడు ఆందోళనాత్మకమైన మానసిక సమస్యలకు గురవుతున్నారు. అలాగే నాడీ సంబంధిత సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. ఇలాంటి వారు వారానికి ఒకసారి మర్ధనం చేయించుకుంటే ఈ తరహా సమస్యల్ని చాలా వరకు దూరంగా ఉంచవచ్చు.


మానసిక ఒత్తిళ్లతో వచ్చే మరెన్నో సమస్యలను కూడా అధిగమించవచ్చు. అలాగే మైగ్రేన్ సమస్యను కూడా మర్ధనతో అధిగమించవచ్చు. వీటితో పాటే నిద్రలేమి సమస్య నుంచి కూడా పాదాలకు చేసే ఒక ప్రత్యేక మర్ధనతో బయటపడవచ్చు. రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడం నుంచి మొదలుకుని, హాయిగా నిదురించే దాకా ఇలా జీవితపు అన్ని దశల్లోనూ మర్ధన చికిత్స ఒక మహత్తర యోగంగా మనిషికి తోడ్పడుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top