సమ్మర్ ట్రిప్‌ను ముందుగానే ప్లాన్ చేసుకుని ఎంజాయ్ చేయాలంటే .....

వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. మే నెలలో ఫామిలీతో కలిసి ఎక్కడికైనా టూర్‌కె వెళ్లాలనుకుంటున్నారు. అలా అనుకోగానే సరికాదు. ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటే కానీ మీ ట్రిప్ ఉల్లాసంగా జరిగే వీలుండదు. ప్లానింగ్‌కు ఈ టిప్స్ చూడండి.

ట్రావెల్ ఎజెంట్ ద్వారా టూర్‌ను ప్లాన్ చేసుకునే రోజులకు కాలం చెల్లింది. ఇప్పుడంతా ఆన్‌లైన్ ట్రావెల్ బుకింగ్ యుగం నడుస్తోంది. పెరిగిన కాంపీటషన్ నేపథ్యంలో ఒక్క క్లిక్‌తో సకల సౌకర్యాలను సమకూరుస్తున్నాయి. ప్లేన్ టికెట్ బుకింగ్ నుంచి హోటల్‌లో రూమ్, అద్దె కారు వరకు అన్ని వసతులను ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకునే సౌలభ్యం ఇప్పుడు ఉంది.

ఇందుకోసం అనేక వెబ్‌సైట్లు ఇంటర్నెట్‌లో దర్శనమిస్తున్నాయి. ప్రత్యేకమైన తగ్గింపు ధరలతో పాటు తక్కువ ధరలో రూమ్‌ను రిజర్వ్ చేసుకునే అవకాశాన్ని ఇవి క ల్పిస్తున్నాయి. ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకునే వారికి డిస్కౌంట్‌లు ఇస్తుంటాయి. కాబట్టి ఈ విషయాలన్నింటని పక్కాగా తెలుసుకుని బుక్ చేసుకోవాలి.


* హోటల్స్‌లో రూమ్‌లు బుక్ చేసుకోవాలనుకునే వారికోసం ప్రత్యేకమైన వెబ్‌సైట్‌లు ఉన్నాయి. ట్రావెల్‌చాచా, హోటల్ డిస్కౌంట్స్, హోటల్స్, ట్రావెల్స్ తదితర వెబ్‌సైట్‌లలో వేల హోటల్‌ల సమాచారం ఉంది. ఎంపిక చేసుకున్న హోటల్‌లో కావలసిన ఆరేంజ్‌మెంట్ చేసిపెట్టడం వీరి పని.

* వెళుతున్న ప్రదేశానికి సంబంధించిన వివరాలు ఉండే ట్రావెల్ గైడ్‌ను కొనుగోలు చేసి పెట్టుకోవాలి. ఒకవేళ మీరు వెళుతున్న ప్రదేశం గురించి మీకు అవగాహన లేనట్లయితే ట్రావెల్ గైడ్ చాలా ఉపయోగపడుతుంది.ట్రావెల్‌గైడ్‌లో వసతి సౌకర్యాల వివరాలు, ఎక్కడ వసతి చేస్తే బాగుంటుంది తదితర వివరాలు పొందుపర్చబడి ఉంటాయి.

* రక్షణ శాఖలో పనిచేస్తున్న వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని హోటల్స్ ప్రత్యేకమైన డిస్కౌంట్ ఇస్తుంటాయి. కాబట్టి ఆ వివరాలు కనుక్కోవడం మంచిది. క్రెడిట్‌కార్డును ఉపయోగించే వారికి కూడా కొంత డిస్కౌంట్ ఇస్తుంటారు. ఈ విషయాలను సాధారణంగా ట్రావెల్ ఎజెంట్‌లు చెప్పరు. కాబట్టి హోటల్ నిర్వాహకులను అడిగి తెలుసుకోవడం ఉత్తమం.


* బిజినెస్ పనిపైన వెళుతున్నట్లయితే సంబంధిత పనికి దగ్గరలోని హోటల్‌ను ఎంచుకోవడం మేలు. దీని వల్ల సమయం కలిసి వస్తుంది. 

* చాలా హోటల్స్‌లో టాక్స్‌ల రూపేణా అధికంగా బిల్లు వసూలు చేస్తుంటారు. టాక్స్, సర్‌చార్జ్, వాట్, ఇతర టాక్స్‌ల రూపేణా అధికంగా బిల్లులు వడ్డిస్తూ ఉంటారు.

* హోటల్‌ను వదిలి వెళ్లే సమయంలో బిల్లు చూస్తే తప్ప ఆ విషయం తెలియదు. ఇటువంటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే రిజర్వేషన్ చేసుకునే సమయంలోనే పూర్తి వివరాలు కనుక్కోవాలి. అప్పుడు చెప్పకుండా రూమ్ ఖాళీ చేసే సమయంలో బిల్లులో వేస్తే చెల్లించనని ఖరాకండీగా చెప్పే అవకాశం ఉంటుంది.

* రెగ్యులర్‌గా ఆన్‌లైన్ బుక్ చేసుకునే వారికి చాలా హోటల్‌లు సర్వీస్ చార్జ్ నుంచి మినహాయింపునిస్తుంటాయి. కాబట్టి ఆ వివరాలు తెలుసుకోవాలి.

* ప్రయాణానికి ముందుగానే రూమ్ రిజర్వ్ చేయించుకుని పెట్టుకోవడం ఉత్తమం. ఒక్కోసారి రూమ్‌లు ఖాళీగా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు రిజర్వ్ చేసుకోకుండా వెళితే ఇబ్బందులు తలెత్తడంతో పాటు ప్రోగ్రాం మొత్తం అప్‌సెట్ అవుతుంది. సో మీ సమ్మర్ ట్రిప్‌ను ముందుగానే ప్లాన్ చేసుకుని ఎంజాయ్ చేస్తారు కదూ? 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top