బిడ్డ కావాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఆహారం, ఆరోగ్యం విషయాల్లో మీరు ఈ కింది జాగ్రత్తలు తీసుకుంటున్నారో లేదో చూసుకోండి.

అన్ని పోషకాలు ఉండే సమతుల ఆహారం తీసుకోవాలి. అంటే మీ ఆహారంలో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, కొవ్వులు, ఖనిజలవణాలు... ఇవన్నీ ఉండేలా చూసుకోవాలి. సమతుల ఆహారం వల్ల అనేక రకాలుగా ఉపయోగం ఉంటుంది. బాలెన్స్‌డ్ డైట్ వల్ల శరీరం బరువు మరీ పెరగకుండా, తగ్గకుండా ఉంటుంది. దాంతో కాబోయే తల్లిలో స్రవించాల్సిన హార్మోన్లు అన్నీ తగిన పాళ్లలో ఉంటాయి. శరీరం బరువు ఒకేలా ఉండటం అన్నది ఆరోగ్యకరమైన శిశువును కనడానికి ఉపయోగపడుతుంది.
  • మీ రోజువారీ పనుల్లో చురుగ్గా ఉన్నారో లేదో చూసుకోండి. అయితే పిల్లలను ప్లాన్ చేసుకునేవారు మరీ ఎక్కువ శక్తి ఉపయోగించాల్సిన (విగరస్) వ్యాయామాలను చేయకూడదు. సన్నగా ఉన్నవారు అలాంటి వ్యాయామాలు చేయడం వల్ల హార్మోన్ల స్రావంలో తేడా వస్తుంది.
  • చాలా ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారం, నూనెలో బాగా వేయించిన పదార్థాలు... అంటే ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ వంటి వాటిని వీలైనంతగా తగ్గించాలి. 
  • ఆకుకూరలు, ఐరన్ పుష్కలంగా ఉండే కాయధాన్యాలు, పాలకూర, బ్రకోలీ వంటి ఆకుకూరలు, నారింజపండ్లు తీసుకోవాలి. 
  • క్రమం తప్పకుండా డాక్టర్ సలహా మేరకు ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ వాడాలి. వాటిని గర్భధారణ జరగడానికి ముందునుంచే మొదలు పెట్టి గర్భం వచ్చాక మొదటి మూడు నెలల పాటు కొనసాగించాలి. ఇది బిడ్డలో పుట్టుకతో వచ్చే ఎన్నో లోపాలను సమర్థంగా నివారిస్తుంది. గర్భస్రావం కాకుండా అరికడుతుంది.
  • కాఫీ లాంటి కెఫిన్ డ్రింక్స్ ఎక్కువగా తాగే అలవాటు ఉన్నవారు, దాన్ని పూర్తిగా మానేయడమో లేదా చాలా పరిమితంగా తీసుకోవడమో చేయాలి.
  • శారీరకంగా / మానసికంగా మరీ ఒత్తిడికి లోనయ్యే వృత్తుల్లో ఉన్నవారు తమ ఒత్తిడులను వీలైనంతగా తగ్గించుకోవాలి.
  • బిడ్డను ప్లాన్ చేసుకునే దశ నుంచి ప్రసవం అయ్యేవరకూ డాక్టర్‌కు చూపిస్తూ ఉండాలి. ఆ సమయంలో జరిగే ఆరోగ్య మార్పులను జాగ్రత్తగా గమనిస్తూ, వాటిని ఒక నోట్‌బుక్‌లో రాసి ఉంచడం మంచిది.
  • కుటుంబ చరిత్రలో ఉన్న జబ్బుల గురించి విధిగా డాక్టర్‌కు తెలపాలి.
  • మీరు ఏవైనా దీర్ఘకాలిక జబ్బులకు మందులు తీసుకుంటూ ఉంటే ఆ విషయాన్ని డాక్టర్‌కు ముందుగానే చెప్పడం మంచిది.  
  • వీలైనంత వరకు ఉల్లాసంగా, సంతోషంగా ఉండేవారు ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిస్తారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top